Prabhas Remuneration: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏ సినిమా చేసినా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తుంటారు. తమ అభిమానులకు ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమాలు చేయడానికి హీరోలు ప్రయత్నం చేస్తుంటారు.అలాగే తమ ఫ్యాన్స్ వాళ్ళను ఎలా చూడాలనుకుంటున్నారో తెలుసుకొని స్టార్ హీరోలు అలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒక్కసారి స్క్రీన్ మీద స్టార్ హీరో కనిపించాడు అంటే చాలు అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. విజిల్స్ వేస్తూ, కేరింతలు కొడుతూ సినిమాని ఎంజాయ్ చేస్తూ చూస్తుంటారు. మొత్తానికైతే ఆయా హీరోల సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చడంలో ప్రేక్షకులు సైతం కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సందర్భంలోనే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిన ప్రభాస్ తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
Also Read: అడుగు బురదలో పవన్.. వీడియోలు వైరల్!
ఇప్పటివరకు ఏ హీరో ఎలాంటి సినిమాలు చేసిన కూడా ప్రభాస్ చేస్తున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి వచ్చే ఆదరణ చాలా ఎక్కువనే చెప్పాలి. పాన్ ఇండియాలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరో కూడా తనే కావడం విశేషం… ఇక ప్రస్తుతం ప్రభాస్ ఒక్క సినిమా కోసం దాదాపు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
ఇక ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ ఈ డబ్బులు ఏం చేస్తున్నాడు అనే డౌట్ మనలో చాలామందికి కలుగుతుంటుంది. నిజానికి ప్రభాస్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ లో సగభాగం తన నాన్న సూర్యనారాయణ రాజు పేరు మీద ఒక ట్రస్ట్ నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో చాలామంది పేదలకు కావాల్సిన సౌకర్యాలను సమకూరుస్తున్నారట.
అలాగే కొంతమంది అనాధ పిల్లల్ని కూడా చదివిస్తున్నారట. ఈ విషయాన్ని బయట ఎక్కడ తెలియకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలని ప్రభాస్ చూస్తున్నాడు. అందుకోసమే ఇవేవీ బయటికి రావడం లేదు. మొత్తానికైతే ప్రభాస్ తన దయ గుణంతో చాలామంది పేదలను ఆదుకుంటున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక మీదట రాబోయే రెమ్యూనరేషన్ తో కూడా ఆయన పేదలకు సహాయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు…