Rajamouli , Mahesh babu
Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ రాజమౌళి(Rajamouli) కి ఉన్న క్రేజ్ మరే దర్శకుడికి ఉండదని చెప్పడంలో చెంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఆయన ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసిన జక్కన్న మరి ఎక్కడ ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నాడనే విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వకుండా చాలా రహస్యంగా సినిమా షూట్ చేస్తున్నాడు. మరి ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఒక్క ఫోటో కూడా లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు మహేష్ బాబు తో చిన్న చిన్న సీన్స్ చిత్రీకరించిన ఆయన ఇప్పుడు భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తీస్తూ ఉండటం విశేషం…
కానీ మహేష్ బాబు మాత్రం అంత పెద్ద భారీ యాక్షన్ ఎపిసోడ్స్ డైరెక్ట్ గా చేయకుండా కొన్ని షాట్లలో డూప్ ని కూడా వాడాలని చెబుతున్నారట. దీంతో రాజమౌళి మహేష్ బాబు తో వేగలేకపోతున్నాను అంటూ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు మహేష్ బాబు చాలా సున్నితంగా ఉండేవాడు అలాగే తనాకు నచ్చిన సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు. మరి ఫస్ట్ టైమ్ రాజమౌళి చెబుతున్నట్టుగా వింటున్నాడు. కానీ దాంట్లో కూడా కొన్ని అబ్జెక్షన్స్ ని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరి రాజమౌళి సినిమా అంటే హీరో రాజమౌళి చెప్పినట్టుగా విన్నప్పుడే మంచి ఔట్ పుట్ అయితే వస్తుంది.
మరి ఇలాంటి సందర్భంలో మన మహేష్ బాబు మాత్రం ఇలా రాజమౌళి చెప్పినట్టు కాకుండా కొంతవరకు తన సొంత అభిప్రాయాలను కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడన్న గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత? రాజమౌళి, మహేష్ ఖండిస్తారా? లేదా? నిజమేనా? అన్నది తెలియాల్సి ఉంది… ఈ విషయంలో రాజమౌళి మహేష్ బాబుని ఎలా డీల్ చేస్తాడు తద్వారా ఈ సినిమా అవుట్ పుట్ ఎలా వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…