CM Revanth Reddy
CM Revanth Reddy: ఇవీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక సీటు కూడా గెలుచుకోలేని దుస్థితి తర్వాత.. భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ప్రచారం. రేవంత్ రెడ్డి పై అయితే ఇక ఒక రేంజ్ లో భారత రాష్ట్ర సమితి, దాని అనుకూల సోషల్ మీడియా విభాగాలు విమర్శలు చేస్తున్నాయి.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలిట భస్మాసుర హస్తం లాగా తయారయ్యాడని.. అందువల్లే ఆ పార్టీ దారుణంగా ఓడిపోతుందని భారత రాష్ట్ర సమితి నాయకులు విపరీతంగా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే చెప్పలేని స్థాయిలో.. వివరించడానికి అర్థం లేని స్థాయిలో ఆరోపిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని.. తెలంగాణలో కూడా ఢిల్లీ ఫలితాలు వస్తాయని.. కాంగ్రెస్ పార్టీ కాలగర్బంలో కలిసిపోయిందని.. ఇలా రకరకాలుగా విమర్శలు చేస్తోంది.. నిన్న ఫలితాలు వెల్లడైన నాటి నుంచి భారత రాష్ట్ర సమితి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే ఢిల్లీలో ఆప్ ఓడిపోయిన తర్వాత.. తనపై వస్తున్న విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు..” ఇండియా కూటమిలో ప్రతి పార్టీ అన్ని తమకే కావాలని కోరుకుంటున్నాయి. అది పెద్ద సమస్యగా మారిపోయింది. హర్యానా రాష్ట్రంలో ఆప్ ప్రవేశించడం.. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం.. ఓ వర్గాలను కావాలని రెచ్చగొట్టడం వల్ల ఆ రాష్ట్రంలో గెలిచే స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయిపోయింది. ఆప్ చేసిన పని వల్ల కాంగ్రెస్ పార్టీ హర్యానా రాష్ట్రంలో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదే పని చేసింది.. ఆప్ తో పొత్తు కుదుర్చుకోకుండా ఒంటరిగా పోటీ చేసింది. పలు స్థానాలలో ఓటు బ్యాంకును చీల్చడం వల్ల ఆప్ నష్టపోయింది. భారతీయ జనతా పార్టీ లాభపడింది. అయితే పిట్టపోరును పిల్లి తీర్చినట్టు.. ఈ వ్యవహారాలలో అటు ఆప్, ఇటు కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ నిండా ముంచింది. రెండు పార్టీలను పక్కనపెట్టి తను మాత్రం లబ్ధి పొందింది. అందుకే అంత కలిసి రావాలి. ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాటి ఆధారంగా ముందుకు వెళితే.. కచ్చితంగా పార్టీలు ఆశించిన ఫలితాలు వస్తాయి. లేకపోతే ఇలానే ఇబ్బంది పడాల్సి వస్తుంది.. ఈ అనుభవాన్ని రాజకీయ పార్టీలు ఒక పాఠం లాగా మార్చుకొని.. గత అనుభవాలను ముందు ఉంచుకొని.. ఇకపై అలా జరగకుండా ప్రయత్నిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ సంచలనంగా మారాయి. రెండు రోజులుగా తనపై విమర్శలు చేస్తున్న వారికి.. సరైన కౌంటర్ ఇచ్చి రేవంత్ నోరు మూయించారు. అయితే రేవంత్ చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం నెగిటివ్ గా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారని.. ఢిల్లీలో పోటీ చేయడాన్ని వేరే విధంగా వ్యక్తికరించారని పేర్కొంటున్నది. ఐతే దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతోంది. హుందాగా ఓటమిని రేవంత్ రెడ్డి అంగీకరించారని.. ఇలాంటి ప్రయత్నం గతంలో ఎన్నడైనా జరిగిందా అని భారత రాష్ట్ర కమిటీ నాయకులకు చురకలు అంటిస్తున్నది.