Rajamouli Lik movie review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి అందులో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. మొదట దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తను ఆ తర్వాత హీరోగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. లవ్ టుడే సినిమాతో విజయాన్ని సాధించిన ఆయన ఆ తర్వాత చేసిన డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో ప్రేక్షకులందరిని అలరించాడు. ప్రస్తుతం ఆయన ‘విఘ్నేష్ శివన్’ దర్శకత్వంలో లిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి కైతే చూపించారట. రాజమౌళి ఈ సినిమాని చూసి చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించినట్టుగా తెలుస్తుంది.
ప్రదీప్ రంగనాథన్ ఇంతకు ముందు చేసిన రెండు మూడు సినిమాల్లో డిఫరెంట్ యాక్టింగ్ చేసి ప్రేక్షకులందరి మన్ననలు పొందుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడం పక్క అంటూ మరికొంతమంది చెబుతున్నారు… రాజమౌళి ఈ సినిమాని చూడటానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే చిన్న ప్రొడ్యూసర్స్ రాజమౌళికి చాలా సన్నిహిత ఫ్రెండ్స్ అని తెలుస్తుంది.
అందువల్లే వాళ్ల వల్ల ఆయన ఈ సినిమాను చూశారట. మొత్తానికైతే ఈ సినిమా రాజమౌళికి నచ్చిందని చెప్పాడు. ఇక ఈనెల 10 వ తేదీన ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందంటే సినిమా బాగుంటుందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్న వాడు అవుతాడు… మొత్తానికైతే ఈ సినిమా అతన్ని స్టార్ హీరోగా నిలబెడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఇంకో 4 రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే… నీ మాత సక్సెస్ ని సాధిస్తే తెలుగు దర్శకులు సైతం ప్రదీప్ రంగనాథంతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి…