Nagarjuna Dacoit movie review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకున్న నటుడు అడివి శేషు… ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన డెకాయిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం… ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీద విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది…
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సుప్రియ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం…రీసెంట్ గా నాగార్జున ఈ సినిమానైతే చూశాడట. తనకి ఈ సినిమా బాగా నచ్చిందని సినిమా యూనిట్ అందరినీ అభినందించినట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తోడుగా క్లైమాక్స్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని అది సినిమా మొత్తానికి ప్రాణం లాంటిదని తన సన్నిహితుల దగ్గర కూడా చెబుతున్నారట.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో నాలుగు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నాగార్జున ఇచ్చిన రివ్యూ ఈ సినిమా మీద అంచనాలను పెంచేస్తుంది… అడవి శేషు నుంచి ఒక సినిమా వస్తుందంటే అది మినిమం గ్యారంటి సినిమాగా ఉంటుందని, ఆయన త అభిమానులను నిరాశపరిచే విధంగా సినిమాలు చేయడు. ఇంతకుముందు థ్రిల్లర్ జానర్ లో సినిమాలను తెరకెక్కించిన ఆయన ఇప్పుడు రాబరీ నేపథ్యంలో ఒక సినిమాని చేయడం అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని కలిగిస్తుంది.
ఇక అడవి శేషు ఈ సినిమాతో ఏ మేరకు ఈ ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే అడవి శేషు తన సక్సెస్ ల పరంపరను కొనసాగించినవాడు అవుతాడు. లేకపోతే మాత్రం కొంతవరకు ఆయన మార్కెట్ డౌన్ అయ్యే అవకాశమైతే ఉందని పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు…