Rajamouli Prashanth Neel Remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కటైపోయింది. ఏ రాష్ట్రంలో ఉన్న ప్రేక్షకుడైన సరే ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా అన్ని భాషల సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే తమకు నచ్చిన సినిమాల పట్ల తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక సినిమా పరిధి పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ సినిమా స్టాండర్డ్స్ ని కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి (Rajamouli) బాహుబలి (Bahubali) లాంటి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి చేయబోతున్న సినిమాల విషయంలో బడ్జెట్స్ భారీగా పెరిగిపోతున్నాయి. దీని వల్ల ప్రొడ్యూసర్స్ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలంటే కొంతవరకు ఇబ్బందిలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అందువల్లే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తను రెమ్యునరేషన్ ని తీసుకోకుండా తన సినిమాకి వచ్చే ప్రాఫిట్స్ లో పర్సంటేజ్ ని తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రొడ్యూసర్ల మీద సినిమా రిలీజ్ కి ముందే అదనపు భారం పడే అవకాశం అయితే లేదు. సినిమా రిలీజ్ తర్వాత ఆ సినిమా సక్సెస్ ను బట్టి అందులో వచ్చే ఫ్రాఫిట్స్ ను బట్టి వాళ్ళు పర్సెంటేజీలు తీసుకుంటారు. కాబట్టి సినిమా ఆడితే ఎక్కువ మొత్తంలో దర్శకులు పర్సంటేజ్ ని తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.
Also Read: NTR and Prashanth Neel : ఎన్టీఆర్ నీల్ సినిమాలో ఒక్క ఫైట్ కోసం హాలీవుడ్ మాస్టర్ రాబోతునాడా..?
సినిమా ఆడకపోతే తక్కువ మొత్తంలో పర్సంటేజ్ ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ప్రొడ్యూసర్స్ కొంతవరకు సేఫ్ జోన్ లో ఉండే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే సినిమాకి బడ్జెట్ పెట్టే సమయంలో కూడా ప్రొడ్యూసర్స్ మీద పెను భారం అయితే పడకుండా ఉంటుంది.
ఇక రాజమౌళి బాటలోనే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కూడా నడుస్తున్నాడు. ఈయన చేసే సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం వల్ల ప్రొడ్యూసర్స్ ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో ఆయన కూడా సినిమా లాభాల్లో వాటాలను తీసుకోవడం స్టార్ట్ చేశాడు.
ఇకమీదట భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రతి సినిమా విషయంలో ప్రతి దర్శకుడు కూడా ఇలాంటి సినిమాలు తీసుకుంటూ ముందుకు సాగడం వల్ల సినిమా బతకడమే కాకుండా ప్రొడ్యూసర్స్ కూడా కొంతవరకు ఊపిరి పీల్చుకున్నట్టుగా అవుతోంది. ఇక ఈ ఇద్దరు దర్శకుల బాటలోనే మిగతా డైరెక్టర్స్ కూడా నడవబోతున్నారు అంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం…