SS Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతున్న నేపధ్యంలో ఇప్పుడు చేయబోయే సినిమాని కూడా నెక్స్ట్ లెవెల్లో నిలపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సీన్స్ ని చిత్రీకరించిన రాజమౌళి తొందర్లోనే రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా తెరకెక్కించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక దానికి తగ్గట్టుగానే 2000 మందితో ఒక భారీ ఫైట్ ని కంపోజ్ చేయడానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ తో ప్రణాళికలైతే రూపొందిస్తున్నాడు. మరి మార్చి లో ఈ ఫైట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా రామోజీ ఫిలిం సిటీ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్ మొత్తాన్ని పూర్తి చేశారట.
మరి 2000 మందితో ఫైట్ అంటే మామూలు విషయం కాదు. ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాలో రామ్ చరణ్ (Ram charan) ఇంట్రడక్షన్ సీన్ ను మించి ఈ సీను ఉండబోతుంది అంటూ చాలామంది దీని మీద కామెంట్స్ అయితే చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా సోషల్ మీడియా మొత్తంలో ఈ న్యూస్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది…
ఇక మహేష్ బాబు ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించడానికి కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో ఇటు మహేష్ బాబు అటు రాజమౌళి ఇద్దరు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు. తద్వారా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మన తెలుగు సినిమాల హవా కొనసాగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ‘జేమ్స్ కామెరూన్’ (James Cameron) లాంటి స్టార్ డైరెక్టర్ పక్కన మన రాజమౌళి నిలవాలనేది అతని కోరిక మరి ఈ సినిమాతో తన కోరికను నెరవేర్చుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలన్నీ ఒకేత్తయితే 1000 కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది…ఇప్పటికే ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాలైతే ఉన్నాయి