Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఈయన చేసిన సినిమాలు వరుస విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాలు చేస్తూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆయన నుంచి వచ్చే సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇదిలా ఉంటే మొదటిసారిగా రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) సైతం ప్రభాస్ (Prabhas) చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ దర్శకుడిగా మారే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి రాజమౌళి కంటే సందీప్ రెడ్డివంగ తన సినిమాని ముందుగా రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట పాన్ వరల్డ్ సినిమాలు చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగనే అనే పేరు కూడా తనకే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే రాజమౌళి సినిమా కంటే ముందే తన సినిమాని రిలీజ్ చేయబోయే ఆలోచనలో సందీప్ ఉన్నాడు.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
దానివల్ల మొదటి పాన్ వరల్డ్ సినిమా చేసింది సందీప్ రెడ్డి వంగ అని చెబుతూ ఉంటారు. రాజమౌళికి దక్కాల్సిన క్రెడిట్ ని తను దక్కించుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా భారీ ఎత్తున ప్రణాళికలు చేసి మరి ఈ సినిమాని చేస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమా విషయంలో ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే ఈ సినిమా 2027లో అయినా లేదంటే 2028లో అయిన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఎవ్వరి సినిమా ఎలా ఉన్నా కూడా రాజమౌళి సినిమా మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : మహేష్ సినిమా కోసం ఖైరతాబాద్ RTO ఆఫీస్ కి వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి!