Rajamouli next movie Hero: ప్రస్తుతం రాజమౌళి(Ss Rajamouli) ‘వారణాసి'(Varanasi Movie) మూవీ షూటింగ్ తో ఎంత బిజీ గా ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే జోర్డాన్ లో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని వచ్చిన టీం, ప్రస్తుతం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ సెట్స్ లో మహేష్ బాబు మరియు ఇతర తారాగణం పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ సెప్టెంబర్ లోపు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ ని మొదలు పెట్టి, జనవరి లోపు అది కూడా పూర్తి చేసి , అదే నెల నుండి ప్రొమోషన్స్ కూడా ప్రారంభించాలనే ప్లాన్ లో ఉన్నాడు రాజమౌళి. పైగా ఈసారి పాన్ వరల్డ్ ని టార్గెట్ చేసాడు కాబట్టి, హాలీవుడ్ లో కూడా ఈ సినిమా గురించి ప్రొమోషన్స్ చేయబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.
కొంతమంది చెప్పేది ఏమిటంటే #RRR మూవీ సీక్వెల్ ని యానిమేషన్ రూపం లో రాజమౌళి తెరకెక్కించబోతున్నాడని , అందుకోసం ఆయన ఒక హాలీవుడ్ స్టూడియో తో కూడా ఒప్పందం కుదిరించుకున్నాడని అంటున్నారు. మరికొంతమంది చెప్పేది ఏమిటంటే రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక సినిమా కమిట్ అయ్యాడని, అక్కినేని అఖిల్ తో తన తదుపరి చిత్రం ఉంటుందని అంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుండి మూడవ తరం వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్, ఇప్పటి వరకు తన కెరీర్ లో ఒక్క సక్సెస్ ని కూడా అందుకోలేకపోయాడు. భారీ ఆశలు , అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ప్రస్తుతం ఆయన ‘లెనిన్’ అనే చిత్రం చేస్తున్నాడు. దీనిపైనా కూడా అక్కినేని ఫ్యాన్స్ లో ఎలాంటి అంచనాలు లేవు.
Also Read: పుట్టినరోజు నాడు గాయంతోనే ‘పెద్ది’ షూటింగ్ లో పాల్గొన్న రామ్ చరణ్.. వీడియో వైరల్..
ఇప్పుడు అఖిల్ హిట్ కొట్టాలంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇచ్చే డైరెక్టర్ కావాలి , అలాంటి డైరెక్టర్ రాజమౌళి నే అని బలంగా నమ్మిన నాగార్జున, అఖిల్ తో తన బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సిందిగా కోరాడట. నాగార్జున స్థాయి వ్యక్తి నోరు తెరిచి అడిగితే రాజమౌళి చెయ్యకుండా ఎలా ఉంటాడు చెప్పండి?, వెంటనే ఓకే చెప్పి భారీ మొత్తం అడ్వాన్స్ కూడా అందుకున్నాడట. అఖిల్ లో కష్టపడే తత్త్వం ఉంది, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ , టాలెంట్ కూడా ఉంది. కానీ కాలం కలిసిరావడం లేదు. సరైన సమయం లో రాజమౌళి తగిలాడు, ఇక అళువైన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అంటూ సోషల్ మీడియా లో ఈ వార్తని తెలుసుకున్న వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.