Rajamouli: జపాన్ దేశం లో యానిమేషన్ సినిమాలకు ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. ఇక్కడ తయారయ్యే యానిమేషన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ‘Naruto’ సిరీస్ ని మన ఇండియన్ ఆడియన్స్ కూడా ఏ రేంజ్ లో చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సిటీ కూడా ఈ యానిమేషన్ చిత్రం దంచికొట్టేసింది. అలా ఒకటి కాదు, రెండు కాదు, జపాన్ కంపెనీస్ ద్వారా తయారు చేయబడిన యానిమేషన్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాయి. అయితే త్వరలోనే #RRR మూవీ సీక్వెల్ కోసం జపాన్ యానిమేషన్ కంపెనీలు పని చేయబోతున్నాయి. రీసెంట్ గా ఒక ప్రముఖ హాలీవుడ్ మీడియా ఛానల్ కి రాజమౌళి(SS Rajamouli) ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ ఐడియా గురించి చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘#RRR మూవీ కి సీక్వెల్ చేసే ఆలోచనలు ప్రస్తుతానికి అయితే లేవు కానీ, రామ్, భీం క్యారెక్టర్స్ ని కొనసాగిస్తూ #RRR యానిమేషన్ చిత్రాన్ని చెయ్యాలనే ఐడియా మాత్రం చాలా రోజుల నుండి నాలో ఉంది. ఇప్పటికే దీని అడాప్షన్ కోసం కొన్ని ప్రముఖ జపనీస్ కంపెనీలతో మాట్లాడం. ఇంకా ఏది అధికారికంగా ప్రారంభం కాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. #RRR చిత్రమంటే మన ఇండియన్స్ కి ఇష్టమే, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండే మూవీ లవర్స్ కి మాత్రం ఈ సినిమా అంటే పిచ్చి. ముఖ్యంగా జపాన్ దేశం లోని మూవీ లవర్స్ ఈ సినిమాని తమ జపాన్ సినిమాలతో సమానంగా ఆదరించారు. అక్కడి ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 2.42 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంతే కాకుండా అక్కడి థియేటర్స్ లో ఈ చిత్రం సంవత్సరానికి పైగా ఆడింది.
అంతటి ఆదరణ దక్కించుకున్న చిత్రం కాబట్టి, ఆ సినిమా లో రామ్, భీం క్యారెక్టర్స్ ని వాళ్ళు అంతలా ఇష్టపడ్డారు కాబట్టి, రాజమౌళి కచ్చితంగా ఈ యానిమేషన్ సీక్వెల్ ఐడియా వర్కౌట్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. సినిమా స్టోరీ బాగుంటే, జపాన్ యానిమేషన్ మూవీస్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండడం వల్ల, వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ‘Naruto’ రేంజ్ లో సెన్సేషన్ సృష్టిస్తుందని బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇది ఎలా ఉండబోతుంది అనేది. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ఈ యానిమేషన్ మూవీ పై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టబోతున్నాడు అని టాక్. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ఏ హీరో తో పని చేయబోతున్నాడు అనే ఆత్రుత అందరిలోనూ ఉంటుంది. కానీ ఆయన ఆలోచన మాత్రం ప్రస్తుతానికి ఈ యానిమేషన్ మీదనే ఉంది.
