Rajamouli : దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)… తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్తానాన్నీ మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండియాలోనే గౌరవం అయితే దక్కేది కాదు. కానీ ఇప్పుడు ప్రపంచం స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీని విస్తరింప చేస్తున్నారు అంటే దానికి మొదటి కారణం రాజమౌళి (Rajamouli) అనే చెప్పాలి. ఆయన ఎప్పుడైతే ప్రభాస్ ను హీరోగా పెట్టి బాహుబలి(Bahubali) సినిమా చేశాడో అప్పటినుంచి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. ఇక బాహుబలి 2 (Bahubali 2) సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియన్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు.
Also Read : తనదైన స్టైల్ లో ‘స్పిరిట్’ హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించిన సందీప్ వంగ..!
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో ‘త్రిబుల్ ఆర్’ (RRR) అనే సినిమాను చేసి సక్సెస్ ని సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇక ఇలాంటి గొప్ప దర్శకుడి గురించి ఇండియా మొత్తం మాట్లాడుకోవడంలో తప్పయితే లేదు ఇతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలందరు పోటీ పడుతున్నారు. ఇక ఈ సినిమాలోని ‘నాటు నాటు’ అనే పాటకి ఆస్కార్ అవార్డు రావడం తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకెక్కిచ్చిందనే చెప్పాలి.
ఇక భారత దేశ ప్రధానమంత్రి అయిన ‘నరేంద్ర మోడీ’ గారు సైతం మాట్లాడుతూ ఇండియాలో రాజమౌళి ల సినిమాలు తీసే దర్శకుడు మరొకరు లేరు అంటూ రాజమౌళి గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఆయన తీసిన బాహుబలి సినిమా చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా ప్రేక్షకులకు అమితంగా నచ్చింది.
కాబట్టి ఆయనలా భారీ గ్రాఫిక్స్ తో సినిమాలు చేయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు మరొకరు లేరని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటూ మోడీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి… ప్రస్తుతం రాజమౌళి ప్రపంచ స్థాయిలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీని అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ యొక్క పవర్ చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
