Bigg Boss Amardeep: సీరియల్ నటుడిగా అమర్ దీప్ ప్రేక్షకులకు సుపరిచితుడే. బిగ్ బాస్ షోతో మరింత దగ్గరయ్యాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అమర్ దీప్ కంటెస్ట్ చేశాడు. మొదట్లో అమర్ దీప్ తడబడ్డాడు. అతని చర్యలలో పరిపక్వత ఉండేది కాదు. అటు ఫిజికల్ గేమ్స్ లో, ఇటు మైండ్ గేమ్స్ లో ఫెయిల్ అయ్యే వాడు. దాంతో ఒక్క వారం కూడా కెప్టెన్ కాలేకపోయాడు. అతని అసహనాన్ని గమనించిన హోస్ట్ నాగార్జున, కెప్టెన్ గా ఛాన్స్ ఇచ్చాడు. అయితే చివరి వారాల్లో అమర్ దీప్ పుంజుకున్నాడు.
దాంతో టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. ఫైనల్ లో పల్లవి ప్రశాంత్ తో టైటిల్ కోసం పోటీపడ్డాడు. రైతుబిడ్డ ట్యాగ్ కారణంగా సింపతీ కూడా తోడు కావడంతో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అమర్ దీప్ రన్నర్ పొజిషన్ తో సరిపెట్టుకున్నాడు. ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో ఎదుట అమర్ దీప్ పై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో కారులో భార్య, తల్లి ఉన్నారని, వారికి ఏమైనా అయితే పరిస్థితి ఏంటని, అమర్ దీప్ అసహనం వ్యక్తం చేశాడు.
కాగా బిగ్ బాస్ షో అనంతరం అమర్ దీప్ సీరియల్స్ చేయడం లేదు. అయితే బుల్లితెర షోలలో సందడి చేస్తున్నాడు. తన అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో అమర్ దీప్ కంటెస్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే భార్య తేజస్వినికి లైవ్ లో ఝలక్ ఇచ్చాడు అమర్ దీప్. భార్య కంటే తనకు ఫ్రెండ్ ఎక్కువని ముఖాన చెప్పాడు. దాంతో తేజస్విని ఒకింత షాక్ అయ్యింది. శ్రీముఖి హోస్ట్ గా ఉన్న ఓ షోలో తేజస్విని, సీరియల్ నటి సుహాసిని పాల్గొన్నారు. సదరు షోలో కంటెస్ట్ చేసిన వారికి సపోర్ట్ చేసేందుకు అమర్ దీప్ వచ్చాడు.
నువ్వు ఎవరి కోసం వచ్చావు? అని యాంకర్ శ్రీముఖి.. అమర్ దీప్ ని అడిగింది. అక్క కోసం వచ్చానని చెప్పారా… అని సుహాసిని అంది. నీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాను. అక్క, భార్య, ఫ్రెండ్.. వీరిలో నీ ఛాయిస్ ఎవరని శ్రీముఖి అడిగింది. అమర్ దీప్ తడుముకోకుండా.. ముందు ఫ్రెండ్, తర్వాతే ఎవరైనా అన్నాడు. భార్య తేజస్విని కంటే అమర్ దీప్ కి ఫ్రెండ్ ఎక్కువయ్యాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా తేజస్వినిని అమర్ దీప్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తేజస్విని సైతం సీరియల్ నటి. ఈ మధ్య ఆమె కూడా సీరియల్స్ చేయడం లేదు.
https://www.youtube.com/shorts/XDGoxMQaFd0