https://oktelugu.com/

Rajamouli – Mahesh : ముహూర్తం ఫిక్స్ చేసిన రాజమౌళి.. ఈ వారంలో మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే వార్త!

ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎప్పుడూ చూడని జానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ లో ఏర్పాటు చేయబోయే ప్రెస్ మీట్ లో సినిమాలో నటించే నటీనటుల గురించి కూడా రాజమౌళి అధికారిక ప్రకటనా చేసే అవకాశాలు ఉన్నాయి అట.

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2024 / 10:02 PM IST

    Rajamouli Mahesh

    Follow us on

    Rajamouli – Mahesh : దేశం మొత్తం ఎదురు చూస్తున్న కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్. ఈ ఇద్దరు ఎవరికి వారు పెద్ద బ్రాండ్ ఇమేజి కలిగి ఉన్న వారు. టాక్ తో సంబంధం లేకుండా లాంగ్ రన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే మహేష్ బాబు ఒక పక్క అయితే, చిన్న పిల్లల దగ్గర నుండి ముసలోళ్ల వరకు ప్రతీ ఒక్కరిని థియేటర్స్ కి క్యూ కట్టించే సత్తా ఉన్న రాజమౌళి మరోపక్క. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే ఇక ఏ రేంజ్ రికార్డ్స్ ఉంటాయో ఊహించగలమా. ఇన్ని రోజులు ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో పోటీ పడిన మన తెలుగు సినీ పరిశ్రమని హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడేలా చేయగల సత్తా ఉన్న చిత్రం ఇది. ఇప్పటికే #RRR చిత్రం హాలీవుడ్ లో గుర్తింపు ని సాధించి ఆస్కార్ అవార్డు ని కూడా సంపాదించింది. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ విషయంలో కూడా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు డైరెక్టర్ రాజమౌళి.

    #RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలుపుకొని 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడితే, మహేష్ కోసం రాజమౌళి 1500 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా స్కేల్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి ఒక్క అప్డేట్ కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ మూవీ టీం నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం తో వాళ్లలో ఆవేశం రోజురోజుకి కట్టలు తెంచుకుంటుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త అభిమానుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ సినిమాని దసరా రోజున గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. లాంచ్ కి ముందు ఒక ప్రెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట.

    అక్టోబర్ మొదటి వారం లో ఈ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయట. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యం లో ఈ సినిమా సాగనుంది. 200 ఏళ్ళ కాలం నాటి కథ అట ఇది. అడవి బాషా కి సంబంధించిన వాళ్ళు, బ్రిటిష్ ప్రభుత్వం బ్యాక్ గ్రౌండ్ కూడా ఇందులో ఉంటుందట. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎప్పుడూ చూడని జానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ లో ఏర్పాటు చేయబోయే ప్రెస్ మీట్ లో సినిమాలో నటించే నటీనటుల గురించి కూడా రాజమౌళి అధికారిక ప్రకటనా చేసే అవకాశాలు ఉన్నాయి అట.