https://oktelugu.com/

Devara : ‘దేవర’ లో ట్రిపుల్ రోల్ లో ఎన్టీఆర్.. ట్విస్తుల మీద ట్విస్తులు.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ యాక్షన్ సన్నివేశాలు అని అంటున్నారు సెన్సార్ సభ్యులు. ట్రైలర్ లో చూపించిన అమాయకమైన ఎన్టీఆర్ క్యారక్టర్ ఇచ్చే ట్విస్టులు ఫ్యాన్స్ ని సీట్స్ లో కూర్చోనివ్వదట. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తన విశ్వరూపం చూపించాడానే చెప్పాలి.

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2024 / 10:05 PM IST

    Devara Movie

    Follow us on

    Devara : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం ‘దేవర’ గురించే చర్చలు నడుస్తున్నాయి. ఎన్టీఆర్ నుండి దాదాపుగా 6 ఏళ్ళ తర్వాత వస్తున్న సోలో చిత్రం కావడంతో ఈ చిత్రం అభిమానులు మాత్రమే కాకుండా, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, మూడవ పాటకు డివైడ్ టాక్ వచ్చింది. ఈ పాట సినిమా కథకు కూడా అడ్డంగా ఉన్నట్టుగా అనిపించడంతో సినిమా నుండి తొలగించినట్టు టాక్ వినిపిస్తుంది. అసలే మూవీ రన్ టైం 3 గంటలు దాటేసింది. ఇలాంటి పాటలు సినిమాకి స్పీడ్ బ్రేకర్స్ లాగా నిలుస్తాయే తప్పు, కంటెంట్ కి ఏమాత్రం కూడా ఉపయోగపడదు.

    ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఫ్యాన్స్, ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. రొటీన్ సబ్జెక్టు లాగానే ఉంది కానీ, కొత్తగా ఏమి లేదని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ‘దేవర’ అనే ఊరి పెద్ద ఉంటాడు. అతనికి నమ్మకస్తుడిగా సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు, అతను దేవర ని వెన్నుపోటు పొడిచి ఊరి పెద్ద అవుతాడు, దేవర కొడుకు అతని మీద పగ తీర్చుకుంటాడు. దేవర ట్రైలర్ ని చూస్తే ఎవరికైనా ఇదే అర్థం అవుతుంది. కానీ స్టోరీ అది కాదట. అందరూ అనుకుంటున్నట్టుగా ఈ చిత్రం లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కాదు, ట్రిపుల్ రోల్ చేసాడు అని టాక్. ‘దేవర’ మరియు ‘వరా’ కవలపిల్లలు. వీళ్లిద్దరికీ తండ్రి పాత్ర పోషించింది కూడా జూనియర్ ఎన్టీఆర్ నే అట. వీళ్ళ ముగ్గురికి సంబంధించిన కథ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఒక మిస్టరీ థ్రిల్లర్ లాగా తీర్చి దిద్దాడట డైరెక్టర్ కొరటాల శివ. ఆడియన్స్ కి ట్విస్టుల మీద ట్విస్టులు, మైండ్ బ్లాక్ అయ్యేంత పని అవుతుందట. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయట.

    ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ యాక్షన్ సన్నివేశాలు అని అంటున్నారు సెన్సార్ సభ్యులు. ట్రైలర్ లో చూపించిన అమాయకమైన ఎన్టీఆర్ క్యారక్టర్ ఇచ్చే ట్విస్టులు ఫ్యాన్స్ ని సీట్స్ లో కూర్చోనివ్వదట. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తన విశ్వరూపం చూపించాడానే చెప్పాలి. ట్రైలర్ లో అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూసి ఇంత నీరసంగా ఇచ్చాడేంటి అని అందరూ బాధపడ్డారు. కానీ సినిమాలో మాత్రం ఇప్పటి వరకు ఎన్నడూ వినని మ్యూజిక్ అనుభూతిని అందించాడట. ఈ చిత్రం 3D వెర్షన్ లో విడుదల అవ్వడం లేదు కానీ, ఐమాక్స్ వెర్షన్ లో మాత్రం విడుదల అవుతుంది. ఇప్పటికే ఐమాక్స్ కంటెంట్ మొత్తం ఓవర్సీస్ కి డెలివర్ చేసేసారట మేకర్స్. చూడాలి మరి ఇంతటి అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది.