Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా వైడ్ గా విస్తరింపజేసిన దర్శకుడు రాజమౌళి… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అలాగే హీరోలకు స్టార్ స్టేటస్ ని తెచ్చి పెట్టడంలో ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఆయన లాంటి దర్శకులు ఎంతమంది ఉన్నా కూడా ఆయనకు ఆయనే సాటి ఆయనకు ఆయనే పోటీ…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన సాధించిన విజయాలు అంతా ఇంతా కాదు. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద చాలా ఫోకస్ చేసి మరి చాలా సంవత్సరాల పాటు గిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు ముహూర్తం జరుపుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు తన ఇంటి నుంచి కారులో అల్యూమినియం ఫ్యాక్టరీ కి బయలుదేరినట్టుగా తెలుస్తోంది.
ఇక అక్కడే పూజా కార్యక్రమాలను నిర్వహించి ఒక చిన్న షాట్ ని కూడా తెరకెక్కించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మహా శివరాత్రి తర్వాత నుంచి ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ గ్రాండ్ ఈవెంట్ లాంచ్ కి ఎవరెవరు చీఫ్ గెస్ట్ లుగా వస్తున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేయడం అనేది యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో అందరూ గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి.
పాన్ వరల్డ్ లో ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మన సినిమాలు అక్కడ భారీ విజయాన్ని సాధించడానికి అవకాశం అయితే లభిస్తుంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే నటినటులు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ని సాధించబోతుంది అనేది విషయం మీద కుడ్ ఒక క్లారిటీ రావాల్సి ఉంది..ఇక ఈ సినిమాకు చేసే ప్రతి టెక్నీషియన్ గురించి రాజమౌళి తెలియజేయడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…