Rohith Sharma : 2024లో టీ20 వరల్డ్ కప్ సాధించి భారత క్రికెట్ జట్టు కీర్తిని పెంచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. బ్యాట్స్‌మెన్‌గా విఫలం అవుతున్న రోహిత్ ఆస్ట్రేలియా టూర్‌లో కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇక కెప్టెన్‌గా జట్టును గెలిపించడంలో, ఆసిస్‌పై వ్యూహాలు రచించంలోనూ రోహిత్ విఫలమవుతున్నారు. దీంతో అతనిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కోచ్ గంభీర్ కెప్టెన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సారథని మార్చాలన్న డిమాండ్ కూడా వస్తోంది.
సచిన్ చెత్త రికార్డును బీట్ చేసిన రోహిత్..
టీమిండియా 2024లో 15 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. రోహిత్‌శర్మ 14 మ్యాచ్‌లు ఆడాడు. కెప్టెన్‌గా రోహిత్ వ్యవహరించాడు. ఒక మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బూమ్రా సారథిగా వ్యవహరించాడు. రోహిత్ సారథ్యంలో 14 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా కేవలం 7 మ్యాచ్‌లలోనే విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను సొంతగడ్డపై కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియాలోనూ రోహిత్‌తోపాటు జట్టు కూడా విఫలం అవుతోంది. గడిచిన ఏడు మ్యాచ్‌లలో 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. రోహిత్ సారథ్యంలో టీమిండియా 14 మ్యాచ్‌లలో 6 ఓడిపోయింది. దీంతో భారత టెస్టు చరిత్రలో చెత్తికార్డుల్లో ఒకడిగా నిలిచాడు. ఏడాదిలో టీమిండియాకు ఎక్కువ ఓటములు తెచ్చి పెట్టిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరిత ఉంది. 1999లో సచిన్ నేతృత్వంలో టీమిండియా 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. దీంతో ఒక్క ఏడాదిలోనే ఎక్కువ టెస్టు పరాజయాలు చూసిన కెప్టెన్‌గా సచిన్ నిలిచాడు. 25 ఏళ్ల ఈ చెత్త రికార్డును ఇప్పుడు రోహిత్ శర్మ అధిగమించాడు.
రోహిత్ ఔట్..
ఆస్ట్రేలియా టూర్‌లో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ విఫలం కావడంతోపాటు, సారథిగా కూడా జట్టును గెలిపించడంలో విఫలం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో సారథిగా రోహిత్‌ను తప్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కోట్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఇక తాను చెప్పినట్లే ఆడాలని టీం సభ్యులకు దిశానిర్దేశం చేశాడు. మరోవైపు మెల్‌బోర్న్ టెస్టుకు సారథిగా బుమ్రాను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బుమ్రాతో కోచ్, సెలక్టర్లు చర్చలు జరపడం అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు.. రోహిత్‌ను తుది జట్టు నుంచి కూడా తప్పిస్తారని సమాచారం. మెల్‌బోర్న్ మ్యాచ్‌లో రోహిత్ ఆడతాడా అన్న ప్రశ్నకు కోచ్ గం«భీర్ సమాధానం దాటవేయడం రోహిత్ ఆడడంపై అనుమానాలకు తావిస్తోంది.