https://oktelugu.com/

Rajamouli : మహేష్ బాబు చేసిన టక్కరి దొంగ సినిమాలోని ఒక సీన్ ను వాడుకుంటున్న రాజమౌళి…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలందరిలో చాలా అందంగా ఉండి అద్భుతమైన నటన ప్రతిభను కలిగి ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు...ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వేరియేషన్ అయితే చూపిస్తూ ఉంటాడు. ఇక ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలా అందంగా తయారవుతున్న మహేష్ బాబుకి పోటీ ఇచ్చే హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 11:11 AM IST

    Rajamouli , Mahesh Babu

    Follow us on

    Rajamouli : ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి…ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిమితమైన ఆయన ఒక్కసారిగా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి రాజమౌళి ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాతో భారీ సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్న రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబును చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట.

    మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మహేష్ బాబు చాలా కొత్తగా కనిపిస్తే మాత్రం సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని కూడా షేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక గతంలో టక్కరి దొంగ లాంటి ఒక కౌబాయ్ సినిమాలో అడ్వెంచర్ జానర్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ను చేశాడు.

    మరి ఇందులో కూడా అలాంటి ఒక సీక్వెన్స్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఆ సీక్వెస్ లో మహేష్ బాబు చాలా వైల్డ్ గా కనిపిస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకుముందు సినిమాల్లో కత్తులను వాడిన రాజమౌళి ఈ సినిమా కోసం ఘన్స్ ను ఎక్కువగా వాడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మహేష్ బాబు భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం మహేష్ బాబు పేరు పాన్ వరల్డ్ లో వినిపిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఇప్పటికే ప్రభాస్ అల్లుఅర్జున్ లాంటి హీరోలు పాన్ ఇండియాలో వాళ్ల సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మహేష్ బాబు ను చాలా డిఫెరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళు అనుకున్నట్టుగా ఈ సినిమాలను కనక భారీ రేంజ్ లో తెరకెక్కించినట్లైతే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా పాన్ వరల్డ్ లో మారు మ్రోగబోతుందనే చెప్పాలి…