Rajamouli and Mahesh babu : కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మహేష్ రాజమౌళి చిత్రం ఇటీవలే ఒడిశా లో మొదలైంది. ఈ మొదటి షెడ్యూల్ లో మహేష్ బాబు(Super Star Mahesh Babu), పృథ్విరాజ్(Prithvi Raj Sukumar) తో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొనింది. అయితే మొదటి నుండి రాజమౌళి కానీ, అతని తండ్రి , కథ రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) కానీ, ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమాని పలు ఇంటర్వూస్ లో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు ఈ జానర్ పై ఒక్క సినిమా కూడా ఇటీవల కాలం లో తెరకెక్కలేదు కాబట్టి ఈ సినిమాపై అంచనాలు స్క్రిప్టింగ్ దశ నుండే భారీగా ఉండేవి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక క్లిప్ సోషల్ మీడియా లో విడుదలై బాగా వైరల్ అయ్యింది.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం అడవిలో భారీ ఫైట్ ను సిద్ధం చేసిన రాజమౌళి…
ఈ క్లిప్ చూసిన తర్వాత ఈ చిత్రం కేవలం ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో మాత్రమే కాదు, సైన్స్ ఫిక్షన్ కూడా అంతర్లీనంగా ఉంటుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమౌళి సినిమా అంటే ఆయన స్టోరీ ని వివరించి చెప్పేవరకు, ఎవ్వరూ ఊహించని విధంగానే ఉంటాయి. ప్రతీ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, ఆ సినిమా స్టోరీ, కాన్సెప్ట్ మొత్తం చెప్పేయడం రాజమౌళి కి అలవాటు. కానీ ఈ సినిమాకు అలాంటివేమీ చెప్పలేదు. కేవలం ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ చిత్రం అని మాత్రమే అని ఒక క్లూ వదిలాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త యాసలో మాట్లాడబోతున్నాడు. అందుకోసం ఆయన ఆరు నెలల పాటు వర్క్ షాప్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. అదే విధంగా సిక్స్ ప్యాక్ బాడీ పెంచడం తో పాటు, మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.
తన జీవితం లో ఏ సినిమాకి పడనంత కష్టం ఆయన ఈ సినిమా కోసం పడుతున్నాడు. రాజమౌళి కూడా ప్రీ ప్రొడక్షన్ స్థాయి నుండే షెడ్యూల్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఎట్టి పరిస్థితిలోనూ ప్లాన్ చేసిన నిడివి లోనే షెడ్యూల్స్ ని పూర్తి చేయాలని, తన కెరీర్ లోనే ది ఫాస్టెస్ట్ మూవీ గా ఈ సినిమాని పూర్తి చేయాలనే కసితో ఉన్నాడు. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాని మనం థియేటర్స్ లో చూడొచ్చు. అంత పకడ్బందీ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తుంది అనే ప్రచారం జరిగింది. కానీ ఆమె హీరోయిన్ గా చేయడం లేదని, ఇందులో ఆమె విలన్ క్యారక్టర్ చేస్తుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్స్. దీనిపై రాజమౌళి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసిన రోజు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Also Read : ఒడిషా అడవుల్లోకి రాజమౌళి-మహేష్ బాబు.. ఏం జరుగుతోంది.?