Mega Family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ వస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక దాదాపు 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మాత్రం చిరంజీవి అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు ఆరుగురు హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. మరి వాళ్ళందరూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తే చూడాలని అభిమానులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుత సమయంలో వాళ్ళందరూ వరుస ప్లాప్ లను అందుకుంటున్నారు. నిజానికి మెగా ఫ్యామిలీ నుంచి సక్సెస్ వచ్చి చాలా రోజులు అవుతోంది. 2023వ సంవత్సరంలో విరూపాక్ష సినిమాతో సాయిధరమ్ తేజ్ సాధించిన విజయం తప్ప అప్పటినుంచి ఇప్పటివరకు మెగా ఫ్యామిలీకి సరైన సక్సెస్ అయితే రాలేదు. చిరంజీవి దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ లో ఉన్న ప్రతి హీరో సినిమాను రిలీజ్ చేసినప్పటికి ఏ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించడం లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళ నుంచి వచ్చే సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటారు.
Also Read: రాజమౌళి దెబ్బకి మరోసారి టికెట్ రేట్లు పెరగబోతున్నాయా..?
లేకపోతే మాత్రం వాళ్లు కొంతవరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి అంటూ సినిమా మేధావుల నుంచి కొన్ని అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. మరి దాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు అర్జెంటుగా మెగా ఫ్యామిలీకి ఒక సక్సెస్ అయితే రావాలి.
మరి ఇప్పటికే ఈ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా వచ్చింది. అది సక్సెస్ ను సాధించలేదు. అలాగే రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కూడా ఈ ఇయర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయింది.
ఇక సెప్టెంబర్ 25వ తేదీన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మెగా ఫ్యామిలీ మరోసారి సక్సెస్ బాట పడతారు. లేకపోతే మాత్రం భారీగా డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…