https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : రాజమౌళి మహేష్ బాబు కాంబోలో సినిమా అప్పుడే రావాల్సిందా..? మరి ఇంత లేట్ ఎందుకు అయిందంటే..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.

Written By:
  • Gopi
  • , Updated On : January 3, 2025 / 09:11 AM IST

    Rajamouli , Mahesh Babu

    Follow us on

    Rajamouli and Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మహేష్ బాబు తో సినిమా చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ నుక్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు మంచి విజయాలను సాధించాలనే దృక్పథంతో ఇప్పటికి ఆయన చాలా ఎక్కువ కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం మహేష్ బాబు తో కలిసి పాన్ వరల్డ్ లో సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా నిన్న ముహూర్తపు కార్యక్రమాలు జరుపుకోవడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ అప్పుడెప్పుడో రావాల్సింది. కానీ అనుకోకుండా అది ఇప్పుడు సెట్ అయింది. రాజమౌళి మర్యాద రామన్న సినిమా చేస్తున్న సమయంలోనే మహేష్ బాబు తో ఒక సినిమా చేయబోతున్నాను అంటూ రాజమౌళి అనౌన్స్ చేశాడు.

    కానీ రాజమౌళి కి ఉన్న బిజీ కమిట్ మెంట్స్ వల్ల ఆ సినిమాని అప్పుడు చేయకుండా ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తుండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తున్న స్టార్ హీరోలు తమదైన రీతులో సత్తా చాటుకుంటున్న నేపధ్యంలో రాజమౌళి ఏకంగా పాన్ వరల్డ్ సినిమాను చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి.

    మరి ఇప్పటివరకు మహేష్ బాబు కి పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేదు. మహేష్ బాబుతో ఆయన ఒక భారీ ప్రయోగం అయితే చేస్తున్నాడు. మరి ఈ ప్రయోగం ఎప్పటివరకు ఫలిస్తుంది ఎంతటి కలెక్షన్స్ ను రాబడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమా కోసం దాదాపు 1300 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది…

    మరి వాళ్ళు పెట్టిన బడ్జెట్ తో ఈ సినిమా మూడు వేల కోట్ల కలెక్షన్స్ రాబడుతుందంటూ చాలా కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా అంతటి వసూళ్లను రాబడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…