Apple Iphone 16 Plus : ఐఫోన్ 16 ప్రో ను చాలా మంది లైక్ చేస్తారు. ఆపిల్ బ్రాండ్ లో చాలా కొత్త ఐఫోన్ ఇది. ప్రస్తుతం చాలా తగ్గింపుతో మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే విజయ్ సేల్స్‌లో దీని ధర రూ. 13,000 తగ్గింది. దీని ఆఫర్ త్వరలో ముగుస్తుంది. విజయ్ సేల్స్ ఎలాంటి షరతులు లేకుండా ఐఫోన్ 16 ప్రోను రూ.1,06,900కి విక్రయిస్తోంది. దీని ధర రూ. 1,19,900.ప్రస్తుతం మీరు రూ. 13,000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు.
HDFC, ICICI, SBI కార్డ్‌లపై మీరు ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు ను పొందవచ్చు. అంటే రూ.4,500 వరకు బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంకులకు డిస్కౌంట్ ఆఫర్ మరింత భిన్నంగా ఉంటుంది. మీరు వీటిలో దేనినైనా ఉపయోగించి చెల్లింపులు చేస్తే, మీరు ఆ ఐఫోన్ 16 ప్రోను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ధర రూ. 1,06,900 128GB స్టోరేజ్ మోడల్ కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలో ఈ ప్రో మోడల్ కావాలనుకునే వారికి మంచి అవకాశం అనే చెప్పాలి.
ఐఫోన్ 16 ప్రో 120Hz ప్రోమోషన్, సన్నని బెజెల్స్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లేతో అందంగా కనిపిస్తుంది. ఇక మీరు ఈ ఐఫోన్ నుంచి మంచి ఫీచర్స్ ను పొందవచ్చు. ప్రామాణిక iPhone 16 మోడల్‌తో పోలిస్తే చాలా మెరుగైన కెమెరా దీనికి అందించారు. ఈ ఫోన్ కెమెరా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి చాలా మంచి ఆప్షన్. అప్‌గ్రేడ్‌లలో సెకండ్-జెన్ క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో కూడిన 48MP ఫ్యూజన్ కెమెరా, ఆటోఫోకస్‌తో 48MP అల్ట్రా-వైడ్, మెరుగైన జూమ్ కోసం 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
ఐఫోన్ 15 ప్రో యూనిట్‌తో పోలిస్తే ఐఫోన్ 16 ప్రో మీకు కొంచెం ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఎందుకంటే ఇది హుడ్ కింద కొంచెం పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. మరి మీలో ఐఫోన్ లవర్స్ ఉంటే ఒక్కసారిగా ఇంత తక్కువ తగ్గింపుతో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఐఫోన్ 16 ప్రోను కొనుగోలు చేసి ఎంజాయ్ చేయండి.
రీసెంట్ గానే యాపిల్ సంస్థ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే నాలుగు వేరియంట్లలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ), కొత్త చిప్ ఏ18తో వచ్చిన ఈ మొబైల్స్‌లో మంచి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను యాపిల్ జత అందిస్తుంది. చూడగానే ఆకట్టుకునే డిజైన్ వీటి సొంతం అని చెప్పవచ్చు.