Rajamouli Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నాడు.దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని సైలెంట్ గా ఫినిష్ చేస్తున్న రాజమౌళి ప్రస్తుతం షూటింగ్ లొకేషన్స్ ని వెతికే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే రాజమౌళి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పాన్ వరల్డ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి రాజమౌళికి వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ దక్కాలంటే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి అందుకే ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం ఈ సినిమా మీదనే పెట్టాలనే విషయం రాజమౌళికి అర్థం అయింది.
అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా తనే దగ్గరుండి మరి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి ఒక సెట్ ని 20 కోట్లు పెట్టి వేయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక సెట్ కోసం అన్ని కోట్లు అవసరమా అంటూ మరి కొంతమంది నోరెళ్ళ బెడుతుంటే ఈ సినిమాకి ఆ సెట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా అలాంటి సెట్ వేయడం అనేది చాలా అవసరమని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక రాజమౌళి సినిమా అంటే పెద్ద సెట్ లు ఉండక తప్పదు. ఇక అందులోనే కీలకమైన సన్నివేశాలు మొత్తం తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్క సెట్ కోసం 20 కోట్లు అంటే మామూలు విషయం కాదు. దానికి ముందు రాజమౌళి కూడా ఒక్క సెట్ కోసం 20 కోట్లు కేటాయించడం కరెక్టేనా అని ఆలోచించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. కానీ ఆ తర్వాత ఆ సినిమాలోని మేజర్ సీన్స్ మొత్తం ఆ సెట్లోనే ఉండడం వల్ల తప్పనిసరిగా వేయించాల్సి వస్తున్నట్లుగా తెలుస్తుంది.ఇక ఇదే క్రమంలో రాజమౌళి ఈ సినిమాతో భారీ సక్సెస్ అయితే కొట్టడానికి రెడీగా ఉన్నాడు.
అందుకే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు ఇక అందులో భాగంగానే ఈ సెట్ ని కూడా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రముఖ హాలీవుడ్ డిజైనర్ల చేత ఈ సెట్ డిజైనింగ్ వేయించినట్టుగా కూడా తెలుస్తుంది… రాజమౌళి అంటే భారీ స్థాయి లో ఉంటుంది అందుకే రాజమౌళి తో ఒక సినిమా అయిన చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు…