Rajamouli- NTR: తెలుగు చలన చిత్ర రంగంలో విలక్షణమైన నటుడు జూనియర్ నందమూరి తారక రామారావు. తన సహజమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్నారు. స్టూడెంట్ నెంబర్ వన్ తో మొదటి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఇక తిరిగి చూసుకోలేదు. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. సింహాద్రి, రాఖీ, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల్లో తనలోని నటనకు ఎంతో పదునుపెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన నటనను చూసిన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కొమరం భీంగా ఎన్టీఆర్ నటన అందరిని ఆకట్టుకుంది. అలా నటించడం వారి రక్తంలో ఉందనే ప్రశంసలు వస్తున్నాయి.

సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తున్నారు. తన చిన్నాన్న బాలకృష్ణ, నాన్న హరికృష్ణలోని నటన కౌశలాన్ని పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్ సహజమైన రీతిలో నటిస్తూ ఎంతో మందిని కట్టిపడేస్తున్నారు. డైలాగ్ డెలివరీలో ఇప్పటివరకు ఆయనను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎంత పెద్ద డైలాగయినా ఇట్టే చెప్పేయడం ఆయనకు అలంకార భాష్యమే. సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్న ఎన్టీఆర్ సినిమాలంటే చాలా మందికి ఇష్టమే. ఆయన సినిమాల్లో నటిస్తున్నట్లుగా ఉండదు జీవిస్తున్నట్లుగా పాత్రలో లీనం కావడం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ సహజమైన నటుడు అని కితాబిచ్చారు. అలాంటి నటుడిని డైరెక్టు చేయడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఎన్టీఆర్ నటన ఓ పవర్ హౌస్ లాంటిదని ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన నటన చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఎన్టీఆర్ కు నటన పుట్టుకతోనే వచ్చిందని పేర్కొనడం గమనార్హం. ఆయన గ్రాస్పింగ్ పవర్, నటనను చూస్తుంటే ముచ్చటేస్తుంది.

ఎన్టీఆర్ నటనను మెచ్చుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు. వైవిధ్యమైన భావజాలంలో సునాయాసంగా నటించడం ఆయన సొంతం. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాకు దొరికిన మరో ఆణిముత్యమని చెబుతున్నారు. తాతలోని హావభావాలు కూడా ఎన్టీఆర్ కు బాగా అబ్బాయి. దీంతో తమ నటవారసుల వారసత్వాన్ని ఎన్టీఆర్ కొనసాగిస్తున్నారు. ఎంతటి డైలాగునైనా సునాయసంగా చెప్పగల సామర్థ్యం ఎన్టీఆర్ కు ఉంది. అందుకే ఆయనకు అభిమానులు ఎక్కువే. దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ ను ఓ పవర్ హౌస్ గా పొగడటం విశేషం.
ఎన్టీఆర్ ఓ అనితర శక్తి. నటనలో మహత్తర మహిమలు పలికించగల నటుడు. దీంతో తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటేందుకు తన శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఆయన చూపిన నటనకు ఆస్కార్ వస్తుందని ఆశించినా కుదరలేదు. కానీ ఆయనలోని నటనకు మంచి మార్కులు పడ్డాయి. కొమరం భీం గా ఎన్టీఆర్ నటనకు అందరు ఆశ్చర్యపోయారు. సహజమైన రీతిలో నటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని పలువురు వ్యాఖ్యానించడం మామూలే.