మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1501 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని చెప్పవచ్చు. https://mazagondock.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. స్టోర్స్ కీపర్, ఫైర్ ఫైటర్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలతో పాటు మెషినిస్ట్, జూనియర్ క్యూసీ ఇన్‌స్పెక్టర్, జూనియర్ డ్రాఫ్ట్స్‌మెన్, ప్లానర్ ఎస్టిమేటర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
18 నుంచి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. https://mazagondock.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
30 మార్కులకు రాతపరీక్ష జరగనుండగా పది మార్కులకు జీకే, 10 మార్కులకు కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, 10 మార్కులకు టెక్నికల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది.