https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో విలన్ గా ఫిక్స్ అయిన ఆ స్టార్ హీరో… జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా…

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంటున్న ఏకైక దర్శకుడు రాజమౌళి... ఆయన లాంటి దర్శకుడు ఇండస్ట్రీలో మరెవరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 01:09 PM IST

    Rajamouli ,Mahesh Babu

    Follow us on

    Rajamouli and Mahesh Babu : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ కొనసాగుతున్న దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తెరకెక్కడమే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్లను ఈజీగా రాబడుతుంది అంటూ ట్రేడ్ పండితులు సైతం ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. అయితే 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంటూ ఉండటం విశేషం…ఇక ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ లాంటి నటీ నటులు ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్ళతో పాటుగా విలన్ పాత్ర కోసం తమిళ్ స్టార్ హీరోను తీసుకోబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరోకు సంబంధించిన లుక్కును కూడా రాజమౌళి రీసెంట్ గా ఫైనల్ చేశారట. మరి ఆ హీరో ఎవరు ఆయన లుక్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇందులో ‘చియాన్ విక్రమ్’ విలన్ గా నటిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఆయనకి లుక్ టెస్ట్ చేసిన రాజమౌళి ఫైనల్ గా తనకొక మేకోవర్ ను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక అందుకే చియాన్ విక్రమ్ ఇక మీదట నుంచి దాదాపు నాలుగు నెలల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

    తన లుక్ ను డిజైన్ చేసిన రాజమౌళి ఆ లుక్ లోకి విక్రమ్ ను తీసుకువచ్చే పనిలో బిజీగా ఉన్నాడట…ఇక ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా ని, మళయాళం ఇండస్ట్రీ నుంచి పృధ్విరాజ్ కుమారన్ ,తమిళ్ నుంచి విక్రమ్ తీసుకున్న ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కిచ్చా సుదీప్ ని కూడా ఈ సినిమాలో భాగం చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇక దీంతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కతాటి మీదికి తీసుకొచ్చాడు. ఇక మొత్తానికైతే రాజమౌళి తలుచుకుంటే కానిది ఏది లేదు అనేది మరోసారి ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు. ఇక వీళ్ళతో పాటుగా మరి కొంతమంది హాలీవుడ్ నటులను కూడా ఈ సినిమాలో భాగం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఈ సినిమాలో నటుల గురించి ఆయన ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమా భారీ తారగణం తో తెరకెక్కడమే కాకుండా యావత్ పాన్ వరల్డ్ ప్రేక్షకులను కూడా మెప్పించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది…