Rajamouli Varanasi: దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి… పాన్ ఇండియాలో తనను మించిన దర్శకుడు మరొకరు లేరనేది వాస్తవం… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు అతనితో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే పాన్ వరల్డ్ లో ఆయన చేస్తున్న సినిమా కోసం మహేష్ బాబు ను ఎంచుకోవడం అనేది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే తెలుగును మినహాయిస్తే మహేష్ బాబు కి పాన్ ఇండియాలో కూడా పెద్దగా మార్కెట్ లేదు. అలాంటి ఒక హీరోతో పాన్ వరల్డ్ సినిమాని చేయడం అనేది పెద్ద సాహసమనే చెప్పాలి. 1100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొడుతుందంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వార్తలైతే వస్తున్నాయి…ఈ సినిమా కోసం రాజమౌళి డిఫరెంట్ స్ట్రాటజీలను వాడాలని చూస్తున్నాడు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిని ఏకం చేసి ఒకే స్టేజి మీద చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమోషన్స్ కి హీరోలందరూ రావడం పక్కా అంటూ రాజమౌళి గతంలో క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేష్ బాబు సైతం ఎవరితో పెద్దగా విభేదాలు ఉండవు. కాబట్టి మహేష్ బాబు అంటే అందరి హీరోలకి చాలా ఇష్టం.
కాబట్టి ప్రతి ఒక్క హీరో మహేష్ బాబు రాజమౌళి కోసం పక్కా వస్తాము అంటూ రాజమౌళికి హామీ అయితే ఇచ్చారట. ఇక 2027 వ సంవత్సరంలో సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలైతే తీసుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాని పకడ్బందీ ప్రణాళికలతో తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటి వరకు మూడు షెడ్యూల్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తొందర్లోనే నాలుగో షెడ్యూల్ ని సైతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…మహేష్ బాబు, పృధ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు… చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందనేది…