spot_img
Homeఎంటర్టైన్మెంట్Rajamouli: ఎన్టీయార్ నా బెస్ట్ ఫ్రెండ్ కాదు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి...

Rajamouli: ఎన్టీయార్ నా బెస్ట్ ఫ్రెండ్ కాదు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి…

Rajamouli: ప్రస్తుతం పాన్ ఇండియా లోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఏకైక దర్శకుడు రాజమౌళి.. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ లో మహేష్ బాబుతో ఒక సినిమాని చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా సత్యదేవ్ హీరోగా నటించిన ‘కృష్ణమ్మ ‘ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి హాజరయ్యాడు. ఇక ఈ ఈవెంట్లో తను మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ టాపిక్ అయితే వచ్చింది.

ఇక దాంతో అక్కడున్న యాంకర్ ఇండస్ట్రీలో మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని అడగగా అక్కడున్న వాళ్ళందరూ ఎన్టీఆర్ అంటూ గట్టిగా అరిచారు. అయితే అది విన్న రాజమౌళి నవ్వుతూ నాకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే బాహుబలి, ఈగ సినిమా ప్రొడ్యూసర్లైన సాయి కొర్రపాటి,శోభు యార్లగడ్డ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ నా తమ్ముడు లాంటోడు తమ్ముడికి ఫ్రెండ్ కి చాలా తేడా ఉంటుంది అంటూ తను మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇక అలాగే కృష్ణమ్మ సినిమా గురించి మాట్లాడుతూ కొరటాల శివ ఈ సినిమాని సమర్పిస్తున్నాడు అనగానే ఈ సినిమాలో ఏదో వైవిధ్యమైన కథంశామైతే ఉంటుందని అనుకుంటున్నాను అంటూ మాట్లాడాడు. అలాగే సత్యదేవ్ లాంటి ఒక నటుడికి సరైన సినిమా పడితే ఆయన స్టార్ హీరోగా మారుతాడు. ఆ సినిమా ఇదే అని నేను భావిస్తున్నాను అంటూ రాజమౌళి మాట్లాడిన మాటలు సినిమా యూనిట్ లో సరికొత్త జోష్ నింపాయనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అంటే రాజమౌళికి చాలా ఇష్టమనే చెప్పాలి. అందుకే ఆయనతో ఇప్పటివరకు నాలుగు సినిమాలను చేశాడు.

ఇంతవరకు ఎవరితో చేయలేని విధంగా ఆయనతో నాలుగు సినిమాలు చేసి ఆయనకు నాలుగు సూపర్ డూపర్ సక్సెస్ లు అందించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళి సినిమాల వల్లే ఎన్టీఆర్ భారీ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక వాటిని మినహాయిస్తే ఎన్టీఆర్ కెరియర్ లో వేరే దర్శకులు ఇచ్చిన సక్సెస్ లు చాలా తక్కువనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version