Rajamouli Bads Of Bollywood: సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఏకైక దర్శకుడు రాజమౌళి… ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ఇండియాలో తనను తాను ఒక స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న సినిమాలు సైతం గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే గతంలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ రాజమౌళి మధ్య చిన్న క్లాసెష్ అయితే వచ్చాయి. అందువల్లే అమీర్ ఖాన్ రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఎంత ట్రై చేసినా కూడా రాజమౌళి మాత్రం అతనితో సినిమాలు చేయడం లేదు. ఇక ఇలాంటి సందర్భంలోనే ‘బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్’ అనే సిరీస్ లో రాజమౌళి అమీర్ ఖాన్ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. నిజానికి అమీర్ ఖాన్ తో రాజమౌళి కలిసి నటించడం అనేది అసాధ్యం. కానీ షారుక్ ఖాన్ కొడుకు అయిన ఆర్యన్ ఖాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడం వల్ల షారుక్ ఖాన్ కోరక మేరకు రాజమౌళి సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమాతో బాలీవుడ్ లో మొదటిసారి నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి ఈ సిరీస్ ఈ నెల 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నా నేపథ్యంలో మొత్తానికైతే ఈ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులు సైతం రాజమౌళి యొక్క యాక్టింగ్ ని చూడబోతున్నారు. నిజానికి రాజమౌళి హీరోల కంటే చాలా గొప్పగా నటిస్తాడని అతనితో పని చేసిన ప్రతి ఒక్క నటుడు అయితే చెబుతూ ఉంటారు.
స్క్రీన్ మీద ఒక మంచి క్యారెక్టర్ లో రాజమౌళి నటిస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికి అది మాత్రం జరగడం లేదు. మొత్తానికైతే ఏదో ఒక చిన్న క్యామియో రోల్ లో నటించి ప్రేక్షకుల యొక్క కోరిక తీరుస్తూ రాజమౌళి ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా మహేష్ బాబుతో చేస్తున్న సినిమా షూటింగ్ కి సంబంధించిన పిక్స్ కూడా లీక్ అయ్యాయి.
సింహంతో మహేష్ బాబు ఫైట్ ఉండబోతున్నట్టుగా చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతోంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఎంతవరకు ఆ సినిమా యొక్క విషయాలను దాచాలని రహస్యంగా ఉంచినప్పటికి ఏదో ఒక విధంగా సినిమాకు సంబంధించిన ఫోటోలు గాని, మ్యాటర్ గాని లీక్ అయిపోతున్నాయి. మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాడు అనేది ఇప్పుడు చర్చనీయంశం గా మారింది…