Rajamouli: సినిమా ఇండస్ట్రీలో ఎంత బ్యా గ్రౌండ్ ఉన్నా సక్సెసులు సాధించడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ అవకాశం రావడానికి వారసత్వం ఉపయోగపడుతుంది కానీ వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఏమాత్రం తడబడిన కూడా ప్రేక్షకులు వాళ్ళను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకే ఆచితూచి మరి ముందుకు అడిగేయాల్సిన అవసరమైతే ఉంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. అలాగే స్టార్ హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. దర్శకుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. ఇక ఆ క్రమంలోనే ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరి మన్ననలు పొందడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాజమౌళి తన కెరీర్ స్టార్టింగ్ లో ఒక స్టార్ హీరో కైతే హెల్ప్ చేశాడు. ఆ హెల్ప్ ని ఆ హీరో ఇప్పటివరకు మర్చిపోవడం లేదట. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే ప్రభాస్ గా తెలుస్తుంది. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా కథని రాజమౌళి మొదట ప్రభాస్ కి వినిపించినప్పటికి ఆయన సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు.
Also Read: పవర్ హౌస్‌గా కరీంనగర్.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర..
కారణం ఏంటంటే ఆ కథ ఆయనకి పెద్దగా నచ్చలేదు. ఇక ఆ తర్వాత రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్, సై, సింహాద్రి లాంటి వరుస సక్సెస్ సక్సెస్ లను సాధించాడు. అప్పుడు ప్రభాస్ ఆ దర్శకుడితో మనం సినిమా చేస్తే బాగుంటుందని తన సన్నిహితులతో చెప్పాడట. ఇక ఈ విషయం రాజమౌళి దాకా వెళ్లడంతో రాజమౌళి ప్రభాస్ కి ఫోన్ చేసి మరి మనం ఈ సినిమా చేద్దామని ఒక స్టోరీ ఉందని చత్రపతి సినిమా స్టోరీ చెప్పారట.
అనుకోకుండా రాజమౌళి వచ్చి అతనికి కథ వినిపించి ఆ సినిమా చేసి తనకు భారీ సక్సెస్ ని అందించడం వల్ల ప్రభాస్ ఇప్పటికి రాజమౌళిని గుర్తుపెట్టుకుంటారట. ఒక సినిమా రిజెక్ట్ చేస్తే మరోసారి ఆ హీరో దగ్గరికి ఎవరు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ రాజమౌళి మాత్రం అలా చేయలేదు.
చత్రపతి సినిమా చేయడానికి ముందే రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. అయిన కూడా ప్రభాస్ ను గుర్తుపెట్టుకొని మరి అతనితో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు… ఇక ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో బాహుబలి వచ్చి ఇండియన్ సినిమా రికార్డులను తిరగ రాసిన విషయం మనకు తెలిసిందే…
