https://oktelugu.com/

మొత్తానికి విరాళం ఇచ్చారు

కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ పరిస్థితులు దేశం లోని అన్ని ఆర్ధిక రంగాలను ఒక కుదుపు కుదిపేసింది. మనీ ట్రాన్సాక్షన్ లేకపోవడం తో దేశమంతా అల్లకల్లోలం అయ్యింది. దినసరి వేతనాలపై బతికే వారి తిప్పలు అన్నీఇన్నీ కావు. అలాంటి సమయంలో పనిలేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభం అయ్యింది సీసీసీకి ఇప్పటికే చిరంజీవి ,నాగార్జున,వెంకటేష్ ,బాలకృష్ణ , ఎన్ టి ఆర్ […]

Written By: , Updated On : April 11, 2020 / 09:48 AM IST
Follow us on


కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ పరిస్థితులు దేశం లోని అన్ని ఆర్ధిక రంగాలను ఒక కుదుపు కుదిపేసింది. మనీ ట్రాన్సాక్షన్ లేకపోవడం తో దేశమంతా అల్లకల్లోలం అయ్యింది. దినసరి వేతనాలపై బతికే వారి తిప్పలు అన్నీఇన్నీ కావు. అలాంటి సమయంలో పనిలేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభం అయ్యింది సీసీసీకి ఇప్పటికే చిరంజీవి ,నాగార్జున,వెంకటేష్ ,బాలకృష్ణ , ఎన్ టి ఆర్ ,ప్రభాస్ , మహేష్ బాబు ,రామ్ చరణ్ ,అల్లు అర్జున్ ,వరుణ్ తేజ్ , సాయిధరమ్ తేజ్, శర్వానంద్ , నాని, రవి తేజ వంటి స్టార్స్ కోటితో మొదలుకొని ,50 లక్షలు ,25 లక్షలు అలా తమకు తోచిన రీతిలో విరాళాలు ఇచ్చారు. వీరిలోతక్కువ మొత్తం అంటే 10 లక్షలు ఇచ్చిన నటుడు సాయి ధరమ్ తేజ్ కావడం విశేషం ఇక వీరేగాక త్రివిక్రమ్ శ్రీనివాస్ , వి. వి. వినాయక్ ,కొరటాల శివ , సంపత్ నంది ,సుకుమార్ వంటి దర్శకులు దిల్ రాజు , యు వి క్రెయేషన్స్ వంటి నిర్మాతలు కూడా లక్షల్లో విరాళం ఇచ్చారు.

ఇంతమంది సి సి సి కి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ అగ్ర దర్శకుడు రాజమౌళి దగ్గరనుంచి ఎలాంటి స్పందన లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అలాంటి టైములో తాజాగా ఎస్ఎస్ రాజమౌళి మరియు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ` కరోనా క్రైసిస్ చారిటీ ‘(సీసీసీ) కి 10 లక్షల రూపాయిలు విరాళంగా ఇచ్చారు.

కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలోని 24 శాఖల్లోని నిరు పేదలకు ` సి సి సి` వారు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. తెలుగు సినీపరిశ్రమలో ఉన్న ప్రతి కార్మికుడి ఇంటికి నెలకు సరిపడా బియ్యం-పప్పు ఉప్పు వంటి నిత్యావసరాలు అందిస్తున్నారు. దర్శక , నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ , దర్శక సంఘం అధ్యక్షుడు ఎన్ శంకర్ బృందం కార్మికులకు నిత్యావసరాల పంపిణీ వ్యవహారం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఏమైనా కష్ట సమయంలో ఇలా తెలుగు చిత్ర సీమకు కార్మికులను ఆదుకుంటున్నందుకు మన సినీ పెద్దలను అభినందించాలి.