https://oktelugu.com/

ఏ.ఆర్ రెహమాన్ కి గుస్సా ఆగాయా…. !

దక్షిణాది సంగీత దర్శకుల్లో ఎ.ఆర్.రెహమాన్ శైలి విభిన్నం ,విఖ్యాతం. ఎన్నో సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ సృష్టించిన మేధావి.భారతీయ చిత్రాలతో పాటు హాలీవుడ్ చిత్రాలకు కూడా తన స్వరాల్ని అందించిన ఘనాపాటి .అలాంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతమే తన ప్రపంచంగా ఉంటారు. వేరే విషయాల్లో జోక్యం తక్కువ. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందర్భానుసారం మేటర్ పోస్ట్ చేస్తుంటారు. తన పనేదో తనది అన్నట్లుండే రెహమాన్ కి సడన్ గా కోపమొచ్చింది. […]

Written By:
  • admin
  • , Updated On : April 11, 2020 / 10:01 AM IST
    Follow us on


    దక్షిణాది సంగీత దర్శకుల్లో ఎ.ఆర్.రెహమాన్ శైలి విభిన్నం ,విఖ్యాతం. ఎన్నో సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ సృష్టించిన మేధావి.భారతీయ చిత్రాలతో పాటు హాలీవుడ్ చిత్రాలకు కూడా తన స్వరాల్ని అందించిన ఘనాపాటి .అలాంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతమే తన ప్రపంచంగా ఉంటారు. వేరే విషయాల్లో జోక్యం తక్కువ. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందర్భానుసారం మేటర్ పోస్ట్ చేస్తుంటారు. తన పనేదో తనది అన్నట్లుండే రెహమాన్ కి సడన్ గా కోపమొచ్చింది.

    సాధారణంగా ఏ.ఆర్ రెహమాన్ కి తాను స్వరపరిచిన పాటలను రీమేక్స్ చేయడమంటే మా చెడ్డ చిరాకు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు కూడా. తాజాగా తన పాటను ఓ మ్యూజిక్ కంపెనీ రీమిక్స్ చేయడంతో రెహమాన్ కోపం ఆకాశాన్ని తాకింది. ఇంతకీ అసలీ విషయం ఏమిటంటే గతంలో అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ కలిసి నటించిన ` ఢిల్లీ 6 ‘ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించడం జరిగింది ..కాగా ఆ సినిమాలో “మసక్కలి మసక్కలి ” పాట సెన్సేషన్ అయ్యింది. కాగా ఇప్పుడు ఆ పాటని `మసక్కలి 2.0 ‘ అనే పేరుతో రీమిక్స్ చేశారట… దాంతో చిర్రెత్తుకొచ్చిన రెహమాన్ ‘‘మసక్కలి పాట కొందరి కష్టం, క్రియేటివిటీ వల్ల పుట్టింది. దాన్ని ఇలా ఖూనీ చేస్తారా?’’ అంటూ ఒరిజినల్ పాటని , రీమిక్స్ సాంగ్ ని కలిపి పోస్ట్ చేశారు. దాంతో ఏ ఆర్ రెహమాన్కు మ్యూజిక్ లవర్స్, నెటిజన్స్ , సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ నుండి భారీ మద్దతు వస్తోంది.