https://oktelugu.com/

శాండల్ వుడ్ లో అడుగు పెడ్తున్న తెలుగు చిత్రం

2019 లోచిన్న సినిమా గా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం `ఎవరు`. అడివి శేష్ , రెజీనా ప్రధాన పాత్రలను పోషించిన ‘ఎవరు’ చిత్రం తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సస్పెన్సు తో పాటు ఆసక్తికరంగా సాగే కథాకథనాలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. దర్శకుడు వెంకట్ రాంజీ విభిన్నమైన కోణాల్లో కథను ఆవిష్కరించిన తీరుకి సర్వత్రా ప్రశంసలు లభించాయి.ప్రేక్షకులు కూడా బ్రహ్మరధం పట్టారు. కేవలం ఏడుకోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ […]

Written By:
  • admin
  • , Updated On : April 10, 2020 / 10:29 PM IST
    Follow us on


    2019 లోచిన్న సినిమా గా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం `ఎవరు`. అడివి శేష్ , రెజీనా ప్రధాన పాత్రలను పోషించిన ‘ఎవరు’ చిత్రం తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సస్పెన్సు తో పాటు ఆసక్తికరంగా సాగే కథాకథనాలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. దర్శకుడు వెంకట్ రాంజీ విభిన్నమైన కోణాల్లో కథను ఆవిష్కరించిన తీరుకి సర్వత్రా ప్రశంసలు లభించాయి.ప్రేక్షకులు కూడా బ్రహ్మరధం పట్టారు. కేవలం ఏడుకోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ చిత్రం 35 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. అలాంటి సంచలన సినిమా ఇప్పుడు కన్నడలో రీమేక్ కాబోతుంది .

    తెలుగులో అడివి శేష్ పోషించిన హీరో పాత్రను కన్నడలో ‘దిగంత్’ పోషించనున్నాడు. ఇక కీలక మైన రెజీనా పాత్రకి ఎవరిని ఎంపిక చేయనున్నారనేది ఇంకా తెలీలేదు. ఇంకో విశేషం ఏమిటంటే తెలుగు సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులే కన్నడ సినిమాకి కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. జెనరల్ గా కన్నడ ప్రేక్షకులు సస్పెన్సు సినిమాలను విపరీతంగా లైక్ చేస్తారు . తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం కన్నడలో కూడా తప్పక విజయం సాదిస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు . ఇక అడివి శేష్ విషయానికొస్తే, మహేశ్ బాబు నిర్మాణంలో ‘మేజర్’ అనే బయోపిక్ సినిమాలో నటిస్తున్నాడు ఇంకో విశేషం ఏమిటంటే ఆ చిత్రం తరవాత అడవి శేష్ ఎవరు సీక్వెల్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది .