Rajamouli: దర్శక ధీరుడిగా తనకంటూ గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ప్రపంచ వ్యాప్తంగా ఒక మంచి పేరు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో విజవల్ వండర్ ని ప్రేక్షకుల ముందు నిలిపిన ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాతో యావత్ ప్రపంచాన్ని సైతం అలరించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి జక్కన్న చేస్తున్న ఈ సినిమా విషయంలో చాలావరకు అభిమానుల్లో చాలా డౌట్లైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. మహేష్ బాబుని రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు అనే దానిమీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇప్పటివరకు రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ని ఇవ్వకపోగా అభిమానుల ఓపికకు కూడా పరీక్ష పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు భార్య అయిన నమ్రత తో మహేష్ బాబు గురించి కొన్ని విషయాలను కూడా మాట్లాడినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
అవి ఏంటి అంటే మహేష్ బాబును ఒక మూడు సంవత్సరాల పాటు తనకి వదిలి పెట్టాలని ఆయన ఎప్పుడు ఇంటికి వస్తున్నాడు. ఎప్పుడు షూట్ కి వెళ్తున్నాడు అనే విషయాన్ని కూడా మీరు పట్టించుకోవద్దంటు రాజమౌళి ఫన్నీ గా నమ్రతకి తెలియజేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి నమ్రత కూడా నవ్వుతూ సమాధానం ఇచ్చినట్టుగా ఫిలింనగర్ సర్కిల్లో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. మరి ఈ విషయాన్ని కూడా ఆయన అభిమానులు చాలా ఫన్నీగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు దాదాపు మూడు సంవత్సరాల పాటు రాజమౌళికి సరెండర్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి అలాంటి రాజమౌళి మహేష్ బాబు సినిమాని ఎలా తెరకెక్కిస్తాడు. అలాగే మహేష్ బాబుని ఇంతకుముందు ఇతర దర్శకులు చూపించిన దానికంటే కొత్తగా ఎలా చూపించబోతున్నాడు అనేది కూడా అందరిలో కలవరాన్ని రేపుతుంది. నిజానికి రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగం యావత్ ఇండియన్ అభిమానులందరూ గర్వపడేలా చేస్తుంది.
అందుకే ప్రతి ఒక్కరు రాజమౌళి టీమ్ కి సపోర్ట్ చేయాలని చాలామంది సినీ విమర్శకులు సైతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులను ఉద్దేశించి కొన్ని మాటలను చెబుతున్నారు… ఇక రాజమౌళి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు, తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి వైభవం రాబోతుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…