Kantara 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు కూడా తమ పరిధిని విస్తరించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే కేజిఎఫ్, కాంతార లాంటి సినిమాలు వచ్చి పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లు సాధించాయి. ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీ ముందు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం తేలిపోతుందనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే ఆయన భారీ సక్సెస్ ని సాధించి తన పేరుని మరొకసారి ఇండియా వైడ్ గా వినిపించేలా చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసమే కాంతార 2 మీద భారీగా ఖర్చు పెట్టి మరి విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో తను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించడమే కాకుండా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించేలా తన నటన కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
క మొత్తానికైతే కాంతార 2 సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది… ఇక ఈ సినిమా మీద దాదాపు 300 కోట్ల వరకు బడ్జెట్ ని పెడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియాలో 1000 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టగలిగే సత్తా ఉన్న సినిమాగా అయితే చెబుతున్నారు. మరి వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాకి 500 కోట్ల కలెక్షన్లు వస్తే సినిమా సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
అలాగే డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టాలు రాకుండా చూసుకోవచ్చు. మరి ఇలాంటి సందర్భంలోనే రిషబ్ శెట్టి చేస్తున్న ఈ ప్రయోగం ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ‘కాంతార ‘ మొదటి పార్ట్ లో రిషబ్ శెట్టి పోషించిన పాత్రకి ‘నేషనల్ అవార్డు’ వచ్చింది. అలాగే కాంతార 2 సినిమాలో మరొక షెడ్ లో నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో కూడా నేషనల్ అవార్డు ను తన ఖాతాలో వేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే రిషబ్ శెట్టి ప్రస్తుతం కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను కొట్టడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. మన తెలుగు హీరోలు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తున్నారో దానికి ఏమాత్రం తీసిపోకుండా రిషబ్ శెట్టి సక్సెస్ లను అందుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి…