Rajamouli: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రాజమౌళి డాన్స్ వీడియో… దర్శకధీరుడిలో ఈ టాలెంట్ కూడా ఉందా!

రాజమౌళి ఫ్యామిలీ కళాకారుల నిలయం. దర్శకులు, సంగీత దర్శకులు, నిర్మాతలు, కాస్ట్యూమ్ డిజైనర్స్ , సింగర్స్... అనేక క్రాఫ్ట్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు.

Written By: S Reddy, Updated On : April 1, 2024 4:31 pm

Rajamouli Dance Video Goes Viral on Social Media

Follow us on

Rajamouli: దర్శకుడు రాజమౌళి డాన్స్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆయన ప్రభుదేవా సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రాజమౌళి ఫ్యామిలీ కళాకారుల నిలయం. దర్శకులు, సంగీత దర్శకులు, నిర్మాతలు, కాస్ట్యూమ్ డిజైనర్స్ , సింగర్స్… అనేక క్రాఫ్ట్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు. ఇక రాజమౌళి కూడా మల్టీ టాలెంటెడ్. దర్శకత్వంతో పాటు ఇతర క్రాఫ్ట్స్ లో కూడా ఆయనకు ప్రావీణ్యం ఉంది.

ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా అదే. ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన అన్ని విషయాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. తాను కోరుకున్న అవుట్ ఫుట్ కోసం ప్రయత్నం చేశాడు. రాజమౌళి అసలు కాంప్రమైజ్ కాడు. రాజమౌళి నటుడు కూడాను. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఆయన చిన్న చిన్న పాత్రలు చేశాడు. సై, బాహుబలి, మజ్ను, రైన్ బో చిత్రాల్లో రాజమౌళి నటించిన విషయం తెలిసిందే. రాజమౌళిలో డాన్సర్ కూడా ఉన్నాడని తాజాగా వెలుగులోకి వచ్చింది.

రాజమౌళి డాన్స్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో రాజమౌళి, రమా రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వేదిక మీద డాన్స్ వేశారు. ప్రేమికుడు చిత్రంలోని ‘అందమైన ప్రేమరాణి’ సాంగ్ కి ప్రభుదేవా, రమా రాజమౌళి డాన్స్ చేశారు. ఈ రొమాంటిక్ వీడియో వైరల్ అవుతుంది. రాజమౌళి టాలెంట్ కి పలువురు ఫిదా అవుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ సంతోషం తెలియజేస్తున్నారు.

రాజమౌళి మరోవైపు ఎస్ఎస్ఎంబి 29 చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు అని సమాచారం. ఇటీవల స్క్రిప్ట్ పనులు పూర్తి చేసినట్లు రాజమౌళి తెలిపారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని రాజమౌళి అన్నారు…