https://oktelugu.com/

New Car In India: మార్కెట్లో కొత్తగా రిలీజ్ అయ్యే కార్లు ఇవే.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

. 2024 ఇయర్ సందర్భంగా కొన్ని కొత్త కార్లను వినియోగదారులను అందించేందుకు రెడీ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే వచ్చిన కార్లు కొత్త తరహాలో వస్తుండగా.. కొన్ని కంపెనీలు మాత్రం కొత్త మోడళ్లను పరిచయం చేయనున్నాయి. వాటి వివరాల్లోకి వెళితే...

Written By:
  • Srinivas
  • , Updated On : April 1, 2024 / 04:38 PM IST

    New cars In India

    Follow us on

    New Car In India: కొత్త ఏడాది సందర్భంగా కొందరు కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఇదే సమయంలో కొన్ని కంపెనీలు సైతం కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తాయి. కార్ల విషయానికొస్తే వినియోగదారులను ఆకర్షించేందుక ఎప్పటి కప్పుడు కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. 2024 ఇయర్ సందర్భంగా కొన్ని కొత్త కార్లను వినియోగదారులను అందించేందుకు రెడీ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే వచ్చిన కార్లు కొత్త తరహాలో వస్తుండగా.. కొన్ని కంపెనీలు మాత్రం కొత్త మోడళ్లను పరిచయం చేయనున్నాయి. వాటి వివరాల్లోకి వెళితే…

    మారుతి కంపెనీ కార్లు అంటే ఎవరైనా ఎక్కువగా లైక్ చేస్తారు. దీని నుంచి రిలీజ్ అయినా స్విప్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యధిక అమ్మకాలు జరుపుకున్న మోడళ్లలో స్విప్ట్ ఒకటి. ఇది ఇప్పుడు కొత్త తరహాలో రానుంది. ఆధునిక టెక్నాలజీతో పాటు లేటేస్ట్ ఫీచర్స్ తో మారుతి ‘స్విప్ట్ ఫేస్ లిప్ట్’ త్వరలో మార్కెట్లో లాంచ్ కానుంది. పాత స్విప్ట్ తో పోలిస్తే కొద్దిగా మార్పులు చేశారు. ధర మాత్రం వినియోగదారులకు అందుబాటులోనే ఉంచనున్నారు.

    ఎస్ యూవీ కార్లను అందించడంలో మహీంద్రా అండ్ మహీంద్రా ముందు ఉంటుంది. ఈ కంపెనీ నుంచి XUV300 ఫేస్ లిప్ట్ రూపంలో కొత్త తరహాలో రానుంది. ఇందులో హెడ్ లైట్స్, రీడిజైన్ గ్రిల్ , అప్డేటేడ్ అల్లాయ్ వీల్స్ అలరించనున్నాయి. పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు డిజిటల్ క్లస్టర్ వంటివి ఇందులో చూడొచ్చు.

    దేశంలో కార్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది టాటా మోటార్స్. ఈ కంపెనీ 2024 ఇయర్ లో ‘ఆల్ట్రోజ్ రేసర్’ అనే ప్రీమియం కార్ ను ఆవిష్కరించనుంది. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు 120 బీహెచ్ పీ పవర్, 170 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. నూతన తరహా డిజైన్ తో పాటు లేటేస్ట్ ఫీచర్స్ ఇందులో ఉండనున్నాయి.

    స్కోడా కంపెనీ సైతం ‘సూపర్బ్’ అనే కారును తీసుకొస్తోంది. ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి 189 బీహెచ్ పీ , 320 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెడాన్ కంప్లీట్ బిల్డ్ యూనిట్ ద్వారా ఇండియా మార్కెట్లో ప్రవేశం కానుంది. టయోటా నుంచి ఎక్స్ యూవీ 300 ఫేస్ లిప్ట్ కూడా‘అర్బన్ క్రూయిజర్’ త్వరలో మార్కెట్లోకి రానుంది.