Sukumar and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్ (Sukumar)… ఆయన చేసిన ప్రతి సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుంది. నిజానికి ఆయన సినిమాల్లో సీన్లను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే డెప్త్ గా ఉంటాయి. సీన్లతో కూడా సినిమాకు సంబంధించిన ఏదో ఒక పాయింట్ ను ఎలివేట్ చేస్తూ చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. అందువల్లే సుకుమార్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది. మరి ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఒకెత్తైతే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. పుష్ప 2(Pushpa 2) సినిమాతో భారీ ఇండస్ట్రీ హిట్టును అందుకున్న ఆయన ఇకమీదట అతను మార్క్ ని మరింత పటిష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్(Ram C) తో చేయబోతున్న సినిమా విషయంలో ఆయన క్యారెక్టరైజేశన్ మీద మళ్లీ కథను రాసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కథను ఫైనల్ చేసిన సుకుమార్ బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో వస్తున్న మూవీ అయిపోయిన వెంటనే ఈ సినిమాని పట్టాలెక్కించే పనులు బిజీ కానున్నారట… మరి ఇలాంటి సందర్భంలోనే సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే సుకుమార్ కి రాజమౌళి(Rajamouli) ని బీట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆయన్ని మాత్రం బీట్ చేయలేకపోతున్నాడు.
కారణం ఏంటి అంటే రాజమౌళి హై ఎలివేషన్స్, ఎమోషన్స్ తో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమాలను చేస్తూ బీ,సీ సెంటర్లో చాలా మంచి పట్టు సాధించాడు. వాళ్ల నుంచి రాజమౌళికి విపరీతమైన కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒకటికి రెండు సార్లు సినిమాలను చూస్తూ భారీ కలెక్షన్స్ ను రాబట్టడంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు.
కానీ సుకుమార్ మాత్రం సెన్సిటివ్ గా సినిమాని డీల్ చేస్తూ వస్తుంటాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడు. అందువల్లే ఆయన సినిమాలు బీ,సీ సెంటర్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవు… మరి ఇలాంటి సందర్భంలోనే పుష్ప 2 సినిమాతో రాజమౌళి రికార్డును బ్రేక్ చేసినప్పటికీ అది సుకుమార్ స్టాండర్డ్ సినిమా కాదు అంటూ కొంతమంది మాత్రం సుకుమార్ మీద విమర్శలు గుప్పించారు.
తన స్టైల్ లో సినిమా తీసి రాజమౌళి రికార్డ్ బ్రేక్ చేసినప్పుడే అది సుకుమార్ గెలుపు అని చాలా మంది చెబుతున్నారు… మరి ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాలో ఇటు సుకుమార్ స్టైల్ ని అనుసరిస్తూనే ఇండస్ట్రీ హిట్ నమోదు చేయాలి చేసి చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి రాజమౌళిని బీట్ చేస్తూ మరోసారి సుకుమార్ తన స్టార్ డమ్ ను విస్తరించుకుంటాడా లేదా అనేది…