Varanasi sequel: ఈమధ్య కాలంలో సీక్వెల్స్ ట్రెండ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఏ రేంజ్ లో నడుస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సరిగ్గా హ్యాండిల్ చేస్తే , ఈ సీక్వెల్స్ బాక్స్ ఆఫీస్ వద్ద వేల కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం వంటివి కూడా చూసాము. కొన్ని సినిమాలకు అయితే అవసరం లేకపోయినా కూడా , కేవలం బ్రాండ్ ఇమేజ్ ని ఉపయోగించుకొని సీక్వెల్స్ తీసి డబ్బులు పిండుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఇలాంటి సమయం లో కథ కి తగ్గట్టు , కేవలం ఒక పార్ట్ ఉంటే సరిపోతుంది , రెండు భాగాలు అవసరం లేదు అని అనుకునే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అలాంటి వారిలో రాజమౌళి కూడా ఒకరు. బాహుబలి చిత్రానికి సీక్వెల్ అవసరం కాబట్టే, ఆయన సీక్వెల్ చేశారు. అదే రాజమౌళి #RRR కి సీక్వెల్ చేయలేదు, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి.
అయితే గత కొంతకాలంగా ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని, మొదటి భాగం విడుదలైన కొద్ది నెలలకు రెండవ భాగం కూడా మొదలు అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే దీనిపై రాజమౌళి రీసెంట్ గానే విదేశాల్లో జరిగిన ‘యానిమేషన్ ఫిలిం ఫెస్టివల్’ లో పాల్గొనగా , అక్కడి విలేఖరులు ఈ సీక్వెల్ ప్రస్తావన ని ఆయన ముందుకు తీసుకొని రావడం తో , రాజమౌళి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ వారణాసి చిత్రాన్ని కేవలం ఒక్క భాగం లోనే తెరకెక్కిస్తున్నామని , దీనికి సీక్వెల్ అవసరం ఏ మాత్రం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశ చెందారు. రాజమౌళి తో రెండో సారి పనిచేసే అదృష్టం మా హీరోకి కలుగుతుందేమో అని ఆశపడ్డామని , ఇప్పుడు సీక్వెల్ లేదని చెప్పడం తో బాధాకరం అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను అక్టోబర్ లోపు పూర్తి చేస్తామని ఇదే ఫిలిం ఫెస్టివల్ లో చెప్పుకొచ్చారు రాజమౌళి. డిసెంబర్ నెల నుండి ప్రొమోషన్స్ మొదలుపెట్టే ప్లాన్ లో కూడా ఉన్నట్టు సమాచారం. ఇకపోతే జులై 6 నుండి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ సెట్స్ లో ‘వారణాసి’ లేటెస్ట్ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ లో శ్రీరాముడి కుంభకర్ణుడితో యుద్ధం చేసే ముందు లీడ్ సన్నివేశాన్ని 3000 కు పైగా జూనియర్ ఆర్టిస్టులతో తెరకెక్కించాలని అనుకుంటున్నారట రాజమౌళి. సినిమాలోనే ఈ సీన్ పెద్ద హైలైట్ గా నిలుస్తుంది. ఏప్రిల్ 7 న అంతర్జాతీయ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా , బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి.
