https://oktelugu.com/

Prabhas Radhe Shyam: సినిమా కొనుకున్న వాళ్ళు అన్యాయం అయిపోయారు

Prabhas Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన మూవీ రాధేశ్యామ్ ఈ నెల 11న విడుదల అయింది. ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపేస్తోంది అనుకున్నారు. కానీ, అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ విఫలం అయింది. అయితే, ఈ సినిమా పర్ఫెక్ట్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ ఈ సినిమాని బతికించడానికి ప్రభాస్ ఫ్యాన్స్ తమ భుజానికెత్తుకున్నా.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. మొదటి రెండు, మూడు రోజుల కలెక్షన్లు […]

Written By:
  • Shiva
  • , Updated On : March 20, 2022 / 04:50 PM IST
    Follow us on

    Prabhas Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన మూవీ రాధేశ్యామ్ ఈ నెల 11న విడుదల అయింది. ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపేస్తోంది అనుకున్నారు. కానీ, అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ విఫలం అయింది. అయితే, ఈ సినిమా పర్ఫెక్ట్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ ఈ సినిమాని బతికించడానికి ప్రభాస్ ఫ్యాన్స్ తమ భుజానికెత్తుకున్నా.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

    Prabhas Radhe Shyam

    మొదటి రెండు, మూడు రోజుల కలెక్షన్లు భారీగానే ఉన్నా.. రోజు రోజుకు క‌లెక్షన్లు డ్రాప్ అవుతూ వ‌స్తున్నాయి. క‌లెక్షన్‌లు ఇలాగే కొన‌సాగితే భారీ డిజాస్ట‌ర్ ఖాయ‌మంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ‘రాధేశ్యామ్’ చిత్రం ఫ్లాప్ టాక్ గురించి పూజా హెగ్డే కూడా నోరు విప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజా కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

    ఇంతకీ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే ఏమి మాట్లాడింది అంటే.. ఆమె మాటల్లోనే.. ‘ఏ సినిమా విషయంలోనైనా ముందే అన్నీ నిన్ఱయించలేం. అసలు ఒక సినిమా హిట్ అవుతుందా.. ప్లాప్ అవుతుందా.. అనేది డెస్టినీనే నిర్ణయిస్తుంది. కొన్ని సినిమాలు ఓకే ఓకేగా ఉన్నా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుని అద్భుతం అనిపిస్తాయి.

    ఇక మరికొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోకపోయినా చూడడానికి అద్భుతంగా ఉంటాయి’ అని ఈ అందాల భామ చాలా అందంగా చెప్పింది. ఏది ఏమైనా లెక్కల వ్యవహారంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టడంలో ‘రాధేశ్యామ్’ అడ్డంగా దొరికిపోయాడు. విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి.

    Radhey Shyam

    ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంటే.. 7000 స్క్రీన్ లలో విడుదల అయ్యింది. కానీ, చివరకు గట్టిగా వంద కోట్లు కూడా కలెక్ట్ చేయలేక చతికిలపడింది. ప్రభాస్ అభిమానులు కూడా ఈ లెక్కల్లోని బొక్కలు చూసి సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారు. మొత్తమ్మీద సినిమా కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ బాగా అన్యాయం అయిపోయారు.

    Tags