ఈ కార్యక్రమం ఈ రోజు ఉదయం 8:30కి మొదలైంది. ఈ హిందీ రీమేక్ లాంచింగ్ కార్యక్రమంలో వినాయక్ తో పాటు రాజమౌళి, నిర్మాత రత్నం, రమా రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ ఛత్రపతి ఒరిజినల్ కథను అందించిన విజయేంద్రప్రసాదే ఈ రీమేక్ కి కూడా కథను అందిస్తున్నాడు. హిందీ వెర్షన్ కి అనుకూలంగా కథలో కొన్ని మార్పులు చేశారు.
ఇక ఈ హిందీ చత్రపతి రీమేక్‌ను పెన్ స్డూడియోస్ భారీ స్థాయిలో అట్టహాసంగా నిర్మించబోతుంది. ఇటు యాక్షన్, అటు ఎమోషన్ తో సాగే ఈ సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంది. పైగా ఈ సినిమాకి అప్పట్లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఎలాగూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి, ఈ సినిమా అతని దగ్గరకు వచ్చింది.
అయితే పక్కా మదర్ సెంటిమెంట్ తో నడిచే కథతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఏ రేంజ్ సక్సెస్ వస్తోందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ ప్రాజెక్టు పట్ల బెల్లంకొండ ఫ్యామిలీ బాగా ఇంట్రస్ట్ గా ఉంది. కాకపోతే కంటెంట్ పాతది. దానికితోడు భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయి. పెద్దగా మాస్ ఇమేజ్ లేని తెలుగు హీరో మీద అసలు యాక్షన్ సీక్వెన్స్ ఎలా వర్కౌట్ అవుతాయో.. ? హిందీ జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.