Chiranjeevi And Rajamouli: ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్న వాళ్లలో రాజమౌళి మొదటి స్థానం లో ఉంటాడు.ఇక ఆయన తీసిన బాహుబలి సినిమాతో ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.
అలాగే ఆ తరువాత తీసిన త్రిబుల్ ఆర్ సినిమాతో మంచి హిత్నందుకొని వరుసగా బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాలతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన డైరెక్టర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ తో మగధీర సినిమా చేసిన టైంలో రాజమౌళి కి చిరంజీవి వార్నింగ్ ఇచ్చినట్టుగా అప్పట్లో చాలా వార్తలు అయితే వైరల్ అయ్యాయి. అయితే నిజానికి చిరంజీవి రాజమౌళి కి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
రాజమౌళి మగధీర సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాని చాలా గ్రాండియర్ గా తీసిన రాజమౌళి ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ కోరుకుంటూ ఉంటాడు. ఆయన ఒక షాట్ కరెక్ట్ గా రావడానికి ఎంత ఎఫర్ట్ అయిన పెడ్తారు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో మొదట హీరో బైక్ జంప్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. దాంట్లో రాజమౌళి రామ్ చరణ్ ని పెట్టి డూప్ లేకుండా ఆ సిన్ ని తెరకెక్కించాడు. దాంతో అది తెలుసుకున్న చిరంజీవి రామ్ చరణ్ మీద ఫైర్ అయ్యాడు.
డూప్ లేకుండా ఇలాంటి రిస్కీ షాట్స్ చేయడం కరెక్ట్ కాదు అంటూ రామ్ చరణ్ ని తిట్టాడు. అలాగే రాజమౌళి తో కూడా మాట్లాడి ఇలాంటి రిస్కీ షాట్స్ చేయకు అని రాజమౌళికి చెప్పాడు. ఇక దాంతో చిరంజీవి చెప్పినట్టు గానే రాజమౌళి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కి కూడా డూప్ ని వాడినట్టు గా అప్పట్లో తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తన కొడుకు అయిన రాంచరణ్ కి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనే ఉద్దేశ్యం తోనే జాగ్రత్తగా షూటింగ్ చేయమని రాజమౌళికి చెప్పినట్టుగా మెగా అభిమానులు అప్పట్లో ఈ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు… ఇక ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందితే, రాంచరణ్ కూడా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…