https://oktelugu.com/

Rajamouli: ఆర్జీవీ మూవీలోని షాట్స్ ను కాపీ చేసి దొరికిపోయిన రాజమౌళి…

తెలుగులో చాలా మంది హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగారు. కానీ దర్శకులు మాత్రం ఒక్కో టైమ్ లో ఒక్కొక్కరు లైమ్ లైట్ లో ఉంటారు. కానీ రాజమౌళి మాత్రం తను చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ఎప్పుడు తనే టాప్ డైరెక్టర్ గా ఉంటున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 16, 2024 / 09:01 AM IST

    Rajamouli(1)

    Follow us on

    Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తన మేనియా ను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక రికార్డును అయితే క్రియేట్ చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే ఆయన వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది. ఆయన ఒకసారి సినిమా చేశాడు అంటే అందులో ఎమోషన్స్ గానీ, ఎలివేషన్స్ గాని చాలా టాప్ నాచ్ లో ఉంటాయి. అందువల్లే తను పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రాజమౌళి తన కెరియర్ స్టార్టింగ్ లో సంచలన దర్శకుడు అయిన రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమా నుంచి కొన్ని షాట్స్ ని కాపీ చేసారనే విషయం మనలో చాలామందికి తెలియదు.

    నిజానికి శివ సినిమాలో నాగార్జున రఘువరన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి డోర్ ని బద్దలు కొడుతూ లోపలికి వస్తాడు. అప్పుడు లో యాంగిల్ ఒక షాట్ అయితే ఉంటుంది. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కోట శ్రీనివాస్ రావు దగ్గరికి వచ్చినప్పుడు అదే షాట్ ని అస్ ఇట్ ఇస్ గా రాజమౌళి వాడాడు. ఇక దాంతో పాటుగా శివ లో నాగార్జున, జె.డి చక్రవర్తి మధ్య జరిగే గొడవ తాలూకు షాట్స్ ను కూడా సింహాద్రి సినిమాలో కొన్ని సీన్స్ లో వాడాడు.

    ఇక మొత్తానికైతే రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఉందని రాజమౌళి చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే కావాలని రాజమౌళి ఆ షాట్స్ పెట్టలేదు. ఆ సినిమా చూసినప్పుడు ఆ షాట్స్ తన మైండ్ లో అలా ఉండిపోయాయి. అందువల్లే అనుకోకుండా తను షాట్ డివిజన్ చేసుకున్నప్పుడు అలాంటి షాట్స్ ఆటోమెటిగ్గా వస్తాయి. ఇంక మొత్తానికైతే ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు.

    ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ ఒకప్పుడు ఆయన అభిమానులే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడంటే ఆయన బి గ్రేడ్ సినిమాలను చేస్తూ కాలం గడుపుతున్నాడు. కానీ ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఆ సినిమా కోసం ఎదురుచూసేవారు…