Pawan Kalyan And Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఎప్పటికే వరుస సినిమాలను చేసుకుంటూ తనదైన రీతిలో సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ప్రజలకు సేవలను కూడా అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు ప్రజలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి పవన్ కళ్యాణ్ కి అవకాశం అయితే దొరికింది. ఇక ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తాడా లేదంటే ఆపేస్తాడా అనే విషయాల మీద సరైన క్లారిటీ ఏదీ రావడం లేదు. ఇక ప్రస్తుతానికి సెట్స్ మీద ఉన్న సినిమాలను మాత్రం పూర్తి చేసే పనిని తొందరలోనే పెట్టుకోపోతున్నట్టు కూడా వార్తలేదే వస్తున్నాయి.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి తనయుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మెగా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా వరకు కీలక పాత్ర వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన గ్లోబల్ స్టార్ గా ఎదగడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో వరుసగా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ సినిమాను కూడా తొందర్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ లో ఎలాంటి సేవా గుణాలు అయితే ఉన్నాయో సేమ్ అలానే రామ్ చరణ్ లో కూడా ఇతరులకు సహాయం చేయాలి. పేదవారిని ఆదుకోవాలి అనే గుణం అయితే ఉంది. ఇక వీరిద్దరి మధ్య కామన్ పాయింట్ ఇదే అని చిరంజీవి ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…
నిజానికి పవన్ కళ్యాణ్ అనుక్షణం ప్రజల గురించి పరితపిస్తూ ఉంటాడు. అందువల్లే తన రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ మాత్రం తన పరిధిలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందని తెలిస్తే వాళ్ళకి సహాయాన్ని అందించడానికి ఎప్పుడు వెనకాడాడు అనే విషయం అయితే మనం తరచుగా వింటూనే ఉంటాము. ఇక వీళ్ళ మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్ వల్లే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడడానికి కూడా హెల్ప్ చేసిందనే చెప్పాలి. మరి ఫ్యూచర్లో రామ్ చరణ్ కూడా రాజకీయాల్లోకి వస్తాడా ఎక్కువమందికి సేవ చేస్తాడా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…