Rajamouli Varanasi: మహేష్ బాబు(Super Star Mahesh Babu) , రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ పై రోజురోజుకి అంచనాలు తారా స్థాయిలో పెరుగుతున్నాయి. రెండేళ్ల తర్వాత విడుదలయ్యే సినిమాకు ఇంత హైప్ క్రియేట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ చిత్రం నుండి కేవలం ఒక గ్లింప్స్ వీడియో, ఒక థీమ్ మ్యూజిక్ సాంగ్ మాత్రమే వచ్చింది. కేవలం రెండు కంటెంట్లకు సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో రోజుకు వేలకొద్దీ రీల్స్ అప్లోడ్ అవుతున్నాయి. రాజమౌళి సినిమాకు ఉన్న మ్యాజిక్ అలాంటిది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుందా లేదా అనే అనుమానాలు అభిమానులకు ఉండడం సహజమే. ఎందుకంటే మేకర్స్ చాలా ‘లో ప్రొఫైల్’ ని మైంటైన్ చేస్తూ వస్తున్నారు. కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యిందని తెలుస్తుంది.
ఈ సినిమా కోసం గా ప్రత్యేకంగా హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియో ని వచ్చే ఏడాది వరకు రాజమౌళి బుక్ చేసేశాడట. అంటే ఇక్కడే సినిమాకు సంబంధించిన షూటింగ్ మేజర్ పార్ట్ ని పూర్తి చెయ్యాలని చూస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ జాయంట్ వెంచర్ అట ఈ ఫిలిం సిటీ స్టూడియో. రాజమౌళి విజన్ కి తగ్గట్టుగా ఈ స్టూడియో ఉండడం తో ముందు వెనుక ఆలోచించకుండా ఇక్కడే షూటింగ్ ని పూర్తి చేస్తారట. ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ లో మహేష్ బాబు తో పాటు, ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొంటుంది. రీసెంట్ గానే క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. గ్లింప్స్ వీడియో లో మహేష్ బాబు చేతిలో త్రిసూలం పట్టుకొని, ఎద్దు పై స్వారీ చేస్తూ వస్తున్న షాట్ గమనించే ఉంటారు, గ్లింప్స్ వీడియో లో అదే హైలైట్ గా నిల్చింది. ఈ షాట్ ఈ స్టూడియో తెరకెక్కించినదే అట.
రాజమౌళి గతం లో తన సినిమాలు అత్యధిక శాతం రామోజీ ఫిలిం సిటీ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ లో చేస్తూ ఉండేవాడు. రామోజీ ఫిలిం సిటీ లో ఇప్పటికీ బాహుబలి మూవీ సెట్టింగ్స్ ఉన్నాయి. వీక్షకులు వెళ్లి ఆ సెట్స్ ని సందర్శించొచ్చు. అదే విధంగా బాహుబలి 2 క్లైమాక్స్ ఫైట్ ని అన్నపూర్ణ 7 ఎకరాల స్థలం లో షూట్ చేశారు. ఇప్పుడు ఈ రెండు స్టూడియోస్ ని కాదని, టీజీ విశ్వప్రసాద్ ఆదీనం లో ఉన్న స్టూడియో ని అద్దెకు తీసుకోవడం గమనార్హం. ఇకపోతే ఈ చిత్రాన్ని 2027 శ్రీ రామ నవమి సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. టాకీ పార్ట్ మొత్తం సమ్మర్ కి పూర్తి అయ్యే అవకాశం ఉంది.