Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ మూవీతో వీళ్ళిద్దరికి మంచి పేరు రావడంతో ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ వంటి సినిమాలను సైతం రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ తో చేశాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను పెట్టి మల్టీ స్టారర్ సినిమాలకు తెర లేపాడు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ని కొన్ని సందర్భాల్లో తక్కువ చేసి మాట్లాడాడు అంటూ అతను అభిమానులు సైతం రాజమౌళి మీద ఫైర్ అవుతున్నారు. గతంలో రాజమౌళి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నా మొదటి సినిమా కోసం హీరోని అడిగినప్పుడు రాఘవేంద్రరావు మాత్రం నాకు జూనియర్ ఎన్టీఆర్ ను ఇచ్చాడని చెప్పాడు.
అలాగే నేను ఎన్టీఆర్ ను చూసినప్పుడు తను చాలా లావుగా ఉండడంతో ఇదేంటి ఇతను ఇలా ఉన్నాడు అని అనుకున్నానని చెప్పాడు. కానీ ఎన్టీఆర్ నటన చాలా అద్భుతంగా ఉందని ఆ సినిమాకు ఈయన సెట్ అవుతాడని చెప్పాడట. ఇక అప్పట్లో రాజమౌళి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా నిలుస్తున్నాయి.
ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ తన నట పొటెన్షియల్టీ ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. కెరియర్ స్టార్టింగ్ లో చాలా లావుగా ఉండి స్ట్రగులైన ఎన్టీఆర్ సర్జరీ చేయించుకొని సన్నబడిపోయాడు. ఇప్పుడు మరింత హ్యాండ్సం గా తయారై ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక రాజమౌళి సైతం మహేష్ బాబు డైరెక్షన్ లో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. డ్రాగన్ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అయితే వారణాసి సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కి సిద్ధమవుతోంది…