https://oktelugu.com/

Rajamouli: తమిళ మీడియాకు క్షమాపణలు చెప్పిన రాజమౌళి.. ఎందుకో తెలుసా?

Rajamouli: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు భారీ లెవెల్​లో ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. వచ్చే ఏడాది జనవరు 7న సినిమా విడుదలకు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​లో వేగం పెంచుతున్నారు మేకర్స్​. ఇటీవలే ఆర్​ఆర్​ార్​ సోల్​ సాంగ్​ […]

Written By: , Updated On : November 28, 2021 / 11:08 AM IST
rajamouli-funny-conversation-with-media
Follow us on

Rajamouli: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు భారీ లెవెల్​లో ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. వచ్చే ఏడాది జనవరు 7న సినిమా విడుదలకు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​లో వేగం పెంచుతున్నారు మేకర్స్​. ఇటీవలే ఆర్​ఆర్​ార్​ సోల్​ సాంగ్​ జనని విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.

Janani Video Song (Telugu) - RRR - MM Keeravaani | NTR, Ram Charan, Ajay Devgn, Alia | SS Rajamouli

తాజాగా, రాజమౌళి, చిత్ర నిర్మాత డివివి దానయ్య, ఈ సాంగ్ తమిళ వెర్షన్‌ను కూడా విడుదల చేశారు.  “ఆర్ఆర్ఆర్”ను సమర్పిస్తున్న బ్యానర్ అయిన లైకా ప్రొడక్షన్స్ అధికారులు చెన్నైలో నిర్వహించిన ‘జనని’ తమిళ వెర్షన్ ‘ఉయిరే’ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జక్కన మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా తమిళమీడియాతో ఇంటరాక్ట్ కానందుకు వారికి క్షమాపణలు చెప్పారు. జనవరిలో ఆర్​ఆర్​ఆర్​ విడుదలకు జరిగే గ్రాండ్​ ప్రమేషనల్​ ఈవెంట్​లో తప్పకుండా వారితో సంభాషిస్తానని హామీ ఇచ్చారు రాజమౌళి. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో అర్​అర్​ఆర్​ సినిమా విడుదల కానుది.

డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు. అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరి బాహుబలి లాగే ఈ సినిమా కూడా రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.