Mega family Vs Nandamuri family: టాలీవుడ్ లో రెండు తిరుగులేని శక్తులుగా ఉన్నాయి నందమూరి, మెగా కుటుంబాలు. పరిశ్రమ నుండి 70 శాతం స్టార్స్ ఈ రెండు కుటుంబాల నుండే ఉన్నారు. నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన లెగసీ బాలయ్య అందుకున్నాడు. టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగారు. బాలయ్య తర్వాత ఆ స్థాయికి ఎదిగిన హీరో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే.

మరోవైపు మెగా ఫ్యామిలీ హీరోల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లా తయారైంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ ఎవర్ గ్రీన్ స్టార్ గా కొనసాగుతుండగా, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ తిరుగులేని స్టార్ డమ్ అందుకున్నారు. ఇక చరణ్ కూడా ఇండస్ట్రీ హిట్స్ తో స్టార్స్ లిస్ట్ లో చేరారు. అల్లు అర్జున్ ఫేమ్ గత ఐదేళ్లలో ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలిసిందే. పక్క రాష్ట్రాల్లో కూడా ఆయనకు అభిమాన సంఘాలు ఉన్నాయి.
ఇక వరుణ్ తేజ్, ధరమ్ తేజ్ కూడా ఓ స్థాయి హీరోలుగా మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. కాగా చాలా కాలంగా మెగా, నందమూరి కుటుంబాల ఫ్యాన్స్ మధ్య అంతరాలు ఉన్నాయి. చిరంజీవి-బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్స్ జరుగుతూ ఉండేవి. ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే పోటీ మరింత రసవత్తరంగా ఉండేది. రికార్డ్స్ గురించి మాట్లాడుతూ మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ డిబేట్లు నడిచేవి.

అయితే అనూహ్యంగా గత ఐదేళ్లలో సమీకరణాలు మారిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీకి దగ్గరయ్యారు. ముఖ్యంగా రామ్ చరణ్ కి క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. చిరంజీవి కూడా ఎన్టీఆర్ కి సన్నిహితంగా ఉంటున్నారు. ఎన్టీఆర్ బర్త్ డేకి చిరంజీవి ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.ఎన్టీఆర్ అలా దగ్గర కావడానికి ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించడం కూడా ఒక కారణం.
అదే సమయంలో బాలయ్య మెగా ఫ్యామిలీ మధ్య అంతరం పెరిగింది. బాలయ్య గతంలో చేసిన కామెంట్స్ ని ఉద్దేశిస్తూ… నాగబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2019 ఎన్నికలకు ముందు బాలయ్యను ఏకిపారేస్తూ నాగబాబు వరుస వీడియోలు చేశారు. అలాగే ఈ మధ్య కరోనా క్రైసిస్ సమయంలో చిరంజీవి అధ్యక్షతన తెలంగాణా మంత్రితో జరిగిన సమావేశానికి బాలయ్యను పిలవకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
Also Read: అప్పటి బాలయ్యను గుర్తు చేస్తున్న ‘జై బాలయ్య’ సాంగ్

చిరంజీవి ను ఉద్దేశిస్తూ బాలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై కూడా నాగబాబు బాలయ్య ను విమర్శించారు. చిరు కుటుంబానికి నాటకీయంగా దూరమైన బాలయ్య… అల్లు వారి కుటుంబానికి దగ్గర కావడం విశేషం గా మారింది. బాలయ్య హోస్ట్ గా మారడం ఒక సంచలనం అయితే, అది అల్లు అరవింద్ కోసం చేయడం మరో సంచలనం. మెగా ఫ్యామిలీ ప్రస్తావన లేకుండా… బాలయ్య బన్నీని స్టార్ అంటూ పొగిడేయడం అనూహ్య పరిణామమే.
అఖండ ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా ఈ బంధం మరోసారి బయటపడింది. ఇదంతా గమనిస్తుంటే.. అటు ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీకి దగ్గరవుతుంటే, బాలయ్య మాత్రం అల్లు ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటున్నారు. రెండు బడా కుటుంబాల మధ్య జరుగుతున్న ఈ పరిణామాలు ఆసక్తిరేపుతున్నాయి.
Also Read: ‘అన్స్టాపబుల్’ జోరుతో మరో సరికొత్త షోకు బాలయ్య శ్రీకారం