Rajamouli And Koratala As Producers: స్టార్ దర్శకులంతా ప్రస్తుతం నిర్మాత అవతారంలోకి మారుతున్నారు. ఇప్పటికే పూరి, తేజ, వినాయక్, సుకుమార్ వంటి దర్శకులు నిర్మాతలుగా మారి బాగా వెనకేసుకున్నారు. ఐతే, దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాతగా మారాడు గానీ, రాజమౌళి మాత్రం నిర్మాణం జోలికి పోలేదు. కానీ, తాజాగా రాజమౌళి కూడా తన పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాకపోతే.. ఈ నిర్మాణ సంస్థను కూడా కార్తికేయనే చూసుకోనున్నాడు. రాజమౌళి చాలా ఆలస్యంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. లేట్ ఎంట్రీ ఇచ్చినా వరుసగా ఓటీటీ సినిమాలను నిర్మించాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. అలాగే దర్శకుడు కొరటాల శివ కూడా ‘కొరటాల క్రియేషన్స్’ అని ఒక బ్యానర్ పెట్టారు. ఈ బ్యానర్ లో ఓటీటీ సినిమాలు చేయనున్నారు.
Also Read: Sai Dharam Tej: పవన్ మూవీ షూటింగ్ లో సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్
మరో దర్శకుడు త్రివిక్రమ్ కూడా ‘ఫార్చున్ ఫోర్’ అనే నిర్మాణ సంస్థని స్థాపించి చిన్న సినిమాల్లో సహ నిర్మాతగా వ్యహరిస్తున్నాడు. ఈ ‘ఫార్చున్ ఫోర్’ సంస్థలో ప్రస్తుతం మూడు సినిమాలు నిర్మాణంలో ఉండటం విశేషం.

తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించే ఒక కాన్సెప్ట్ సినిమాలో కూడా త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. కానీ ఆయన తన పేరుకు బదులు తన భార్య సౌజన్య పేరును టైటిల్ గా వేస్తున్నారు. పవన్ కి కూడా ఈ సంస్థలో భాగస్వామ్యం ఉంది.
అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు సహకారంతో స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా నిర్మాణంలోకి దిగాడు. దిల్ రాజు – హరీష్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ “ఏటీఎమ్”. జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. మొత్తానికి నేటి స్టార్ దర్శకులంతా నిర్మాణం మీద పడ్డారు.

Also Read: Employees Says Goodbye To Jobs: నచ్చితే చేస్తా.. లేకుంటే పోతాం.. కొలువలకు టాటా చెబుతున్న ఉద్యోగులు!
[…] Also Read: Rajamouli And Koratala As Producers: నిర్మాతలుగా రాజమౌళి, కొ… […]