https://oktelugu.com/

Rajamouli: రాజమౌళితో పవన్ కళ్యాణ్ కి ఇక కష్టమే !

Rajamouli: రాజమౌళితో ఒక సినిమా అయినా చేయాలి అని మెగాస్టార్, రజినీకాంత్ లాంటి స్టార్లు కూడా ఆశ పడుతున్న కాలం ఇది. అలాంటిది.. రాజమౌళితో సినిమా చేసే అవకాశం వచ్చినా… పవన్ కళ్యాణ్ కాదు అనుకున్నారు. కాకపోతే అది గతంలో. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కలయికలో ఒక సినిమా వస్తోందని అసలు ఊహించలేం. కాకపోతే.. వీరిద్దరి మధ్య త్వరలోనే ఓ మీటింగ్ ఉంటుందని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటివరకు పవన్ […]

Written By: , Updated On : December 7, 2021 / 12:30 PM IST
Follow us on

Rajamouli: రాజమౌళితో ఒక సినిమా అయినా చేయాలి అని మెగాస్టార్, రజినీకాంత్ లాంటి స్టార్లు కూడా ఆశ పడుతున్న కాలం ఇది. అలాంటిది.. రాజమౌళితో సినిమా చేసే అవకాశం వచ్చినా… పవన్ కళ్యాణ్ కాదు అనుకున్నారు. కాకపోతే అది గతంలో. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కలయికలో ఒక సినిమా వస్తోందని అసలు ఊహించలేం. కాకపోతే.. వీరిద్దరి మధ్య త్వరలోనే ఓ మీటింగ్ ఉంటుందని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది.

Rajamouli Pawan Kalyan

Rajamouli Pawan Kalyan

కానీ, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ని రాజమౌళి కలవలేదు. కలవాలనే ఆసక్తి కూడా చూపించలేదు. రీసెంట్ గా ఓ స్టేజ్ పై పవన్ తో సినిమా పై రాజమౌళి స్పందించాడు. తనకు పవన్ తో సెట్ అవ్వదు అని, ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. అయితే, వీరిద్దరినీ కలపాలని దిల్ రాజు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంతో వీరి కలయికలో సినిమా వస్తోందేమో అని ఆశ పడ్డారు పవన్ ఫ్యాన్స్.

కానీ, అది కుదిరేలా లేదు. ఎందుకంటే.. ‘ఆర్ఆర్ఆర్” జనవరి 7న రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” జనవరి 12న రాబోతుంది. నిజానికి “భీమ్లా నాయక్” రిలీజ్ అవ్వడం రాజమౌళికి ఇష్టం లేదు. ఈ విషయంలో జక్కన్న, పవన్ తో మాట్లాడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, పవన్ మాత్రం తన సినిమా రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గలేదట.

Also Read: Akhanda: అఖండ ఉత్సాహంతో బోయపాటితో చిరు కాంబోకు ప్లాన్​?

ఇప్పుడు “భీమ్లా నాయక్” వాయిదా పడితేనే “ఆర్ఆర్ఆర్”కు ఎక్కువ లాభం వస్తోంది. అదే “భీమ్లా నాయక్” రిలీజ్ అయితే, సగం థియేటర్లను “భీమ్లా నాయక్” కోసం ఇవ్వాల్సి ఉంటుంది. మధ్యలో రాధేశ్యామ్ ఎలాగూ ఉంది. అందుకే రాజమౌళి రంగంలోకి దిగి పవన్ ను రిక్వెస్ట్ చేశాడు.

పవన్ మాత్రం ఒప్పుకోలేదు. పైగా తన “భీమ్లా నాయక్” విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదు అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పాడట. ఈ విషయంలో రాజమౌళి బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ తమ సినిమా పట్ల పట్టుదలకు పోవడం రాజమౌళి జీర్ణించుకోవడం లేదు.

Also Read: Mahesh: మహేష్ మంచి మనసు… మల్టీస్టారర్స్ చేస్తాడట

Tags