https://oktelugu.com/

Prabhas: ఏపీలో వరద బాధితులకు అండగా కోటి రూపాయల విరాళం ప్రకటించిన ప్రభాస్…

Prabhas: ఆంధ్రప్రదేశ్‏ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ వర్షాలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఈ వరద కష్టాలు వీడలేదు అని చెప్పాలి. ఇక పలు ప్రాంతాలలో గ్రామాలకు గ్రామాలే వరదలో మునిగిపోగా… భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. కాగా వారికి ఏపీ ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 12:23 PM IST
    Follow us on

    Prabhas: ఆంధ్రప్రదేశ్‏ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ వర్షాలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఈ వరద కష్టాలు వీడలేదు అని చెప్పాలి. ఇక పలు ప్రాంతాలలో గ్రామాలకు గ్రామాలే వరదలో మునిగిపోగా… భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. కాగా వారికి ఏపీ ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.

    ముఖ్యంగా ఆపద అంటే ముందుండే సినీతారులు మరోసారి స్పందిస్తూ విరాళాలు అందజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా సినీనటుడు ప్రభాస్ కూడా తన వంతుగా వరద బాధితులకు సహాయంగా రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. సామాజిక కార్యక్రమాల్లో ముందుండే ప్రభాస్ గతంలో కరోనా సమయంలోనూ, హైదరాబాద్ నగరం వరదల్లో మునిగినప్పుడు కూడా తన వంతుగా సహాయం అందించారు. కాగా ఇప్పుడు తాజాగా వరద బాధితులకు అండగా కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాగార్జున, అల్లు అర్జున్ తో సహా పలువురు సినీ పరిశ్రమ నుంచి విరాళాలు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అలానే ఇల్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇల్లు నిర్మించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే భారీ వర్షాల కారణంగా మరణించిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తోంది జగన్ సర్కార్.